CM KCR : సంక్షేమం తెలంగాణ సంక‌ల్పం – కేసీఆర్

ప్ర‌గ‌తి ప‌థంలో నా తెలంగాణ

CM KCR : పాల‌న రాద‌న్నారు. గేలి చేశారు. దూషించారు. అన‌రాని మాట‌లు అన్నారు. చీవాట్లు పెట్టారు. కానీ ఎక్కడా త‌గ్గ‌లేదు. రాష్ట్రం సాధించేంత దాకా తాను కాలు మోప‌న‌ని చెప్పా. అదే చేసి చూపించా.

ఆనాటి నుంచి నేటి దాకా తెలంగాణ రాష్ట్రాన్ని ప్ర‌గ‌తిప‌థంలో ప‌య‌నించేలా చేస్తున్నాన‌ని చెప్పారు సీఎం కేసీఆర్(CM KCR). తెలంగాణ ఆవిర్భావ వేడుక‌ల సంద‌ర్భంగా సీఎం పాల్గొని ప్ర‌సంగించారు.

దేశంలో ఎక్క‌డా లేని రీతిలో సంక్షేమ ప‌థాకాల‌ను అమ‌లు చేస్తున్నామ‌ని చెప్పారు. ఇవాళ తెలంగాణ దేశానికి ఆద‌ర్శంగా నిలిచింద‌ని చెప్పారు.

ఎన్ని అడ్డంకులు వ‌చ్చినా, అవాంత‌రాలు క‌లుగ చేసినా వాట‌న్నింటిని దాటుకుని ముందుకు వెళుతున్నామ‌ని అన్నారు కేసీఆర్(CM KCR). అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల సంక్షేమ‌మే ధ్యేయంగా ప‌ని చేస్తున్నామ‌ని చెప్పారు సీఎం.

రైతుల సంక్షేమం కోసం అనేక సంస్క‌ర‌ణ‌లు తీసుకు వ‌చ్చామ‌ని తెలిపారు. దీంతో రాష్ట్రం సుజ‌ల స‌స్య‌శ్యామ‌ల తెలంగాణ‌గా మారింద‌న్నారు. ఎక్క‌డ చూసినా ప‌చ్చ‌ద‌నంతో పంట‌లు అల‌రారుతున్నాయ‌ని పేర్కొన్నారు.

ఆనాడు మ‌హాక‌వి దాశ‌ర‌థి చెప్పిన‌ట్టు నా తెలంగాణ కోటి ర‌త‌ణాల వీణ అన్న దానిని నిజం చేసే ప‌నిలో ఉన్నాన‌ని కేసీఆర్ చెప్పారు. రైతుల కోసం రుణ మాఫీ చేశాం. 24 గంట‌ల పాటు ఉచిత విద్యుత్తు ఇస్తున్నామ‌న్నారు.

మిష‌న్ కాక‌తీయ తో చెరువుల‌ను పున‌రుద్ద‌రించామ‌ని చెప్పారు కేసీఆర్(CM KCR). ప్ర‌తి 5 వేల ఎక‌రాల‌కు ఏఇఓల‌ను నియ‌మించ‌డం జ‌రిగింద‌న్నారు.

రైతు వేదిక‌లు చేప‌ట్టాం. రైతు బంధు స‌మితులు ఏర్పాటు చేశామన్నారు. ప్రాజెక్టులు నిర్మించి రైతుల‌కు సాగు నీరుకు ఇబ్బంది లేకుండా చేశామ‌న్నారు.

Also Read : వ్య‌వ‌సాయం జీవ‌న యానం – కేసీఆర్

Leave A Reply

Your Email Id will not be published!