CM KCR : భారత రాజకీయాల్లో సిన్హా అరుదైన నేత
తప్పక గెలుస్తారన్న నమ్మకం ఉంది
CM KCR : సీఎం కేసీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. భారత రాజకీయాల్లో యశ్వంత్ సిన్హా(Yashwant Sinha) అరుదైన నాయకుడంటూ కితాబు ఇచ్చారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా బరిలో ఉన్న సిన్హాకు టీఆర్ఎస్ బేషరతుగా మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది.
ఈ మేరకు ఇవాళ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం హైదరాబాద్ కు విచ్చేశారు యశ్వంత్ సిన్హా. స్వయంగా సీఎం కేసీఆర్ , మంత్రులతో కలిసి స్వాగతం పలికారు.
అనంతరం జల విహార్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో కేసీఆర్(CM KCR) మాట్లాడారు. రాష్ట్రపతిగా మంచి వ్యక్తిని ఎన్ను కోవాల్సిన అవసరం మనందరిపై ఉందన్నారు సీఎం. న్యాయవాదిగా తన ప్రస్థానం మొదలు పెట్టారని తెలిపారు.
ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ గా పని చేశారని, పలు పదవులు నిర్వహించి రాజీనామా చేశారని చెప్పారు. అంచెలంచెలుగా కేంద్ర మంత్రిగా ఎదిగారని కొనియాడారు.
ఆయన రాష్ట్రపతి గా నిలవడం మనందరికీ గర్వకారణమన్నారు కేసీఆర్. ఉన్నతాధికారిగా, రాజనీతిజ్ఞుడుగా తనను తాను నిరూపించు కున్నారని కితాబు ఇచ్చారు సీఎం.
దేశంలో రాజకీయాలు మూస ధోరణితో వెళుతున్నారని పేర్కొన్నారు. గుణనాత్మకంగా మార్పు రావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు కేసీఆర్.
ఎంపీలు మనస్సాక్షితో ఓటు హక్కు వినియోగించు కోవాలని పిలుపునిచ్చారు. ఇదే సమయంలో ప్రధానమంత్రి మోదీపై నిప్పులు చెరిగారు. ప్రధాని తనను తాను మేధావిగా భావించుకుంటారని ఎద్దేవా చేశారు.
ఆయన తమ పార్టీపై తనపై ఆరోపణలు చేయబోతున్నారని తనకు తెలుసన్నారు. ఎన్నికలప్పుడు ఎన్నో హామీలు ఇస్తారు. ఆ తర్వాత వాటి గురించి మాట్లాడేందుకు ఇష్ట పడరని ఎద్దేవా చేశారు కేసీఆర్.
Also Read : యశ్వంత్ సిన్హాకు కేసీఆర్ స్వాగతం