KTR : కొట్టుకు చావమని ఏ దేవుడు చెప్పిండు
బీజేపీ నేతలకు మంత్రి కేటీఆర్ ప్రశ్న
KTR : మతం ఎన్నటికీ విధ్వంసాన్ని కోరుకోదు. ఘర్షణలు జరగాలని ఆశించదు. మతం సారం ఒక్కటే మానవత్వం. అది లేక పోతే దానికి అర్థం ఉండదు.
సాటి మనుషుల పట్ల ప్రేమ, కరుణ, దయ, వాత్సల్యం , ఆసరా, భరోసా ఇవ్వడమే మతం ఉద్దేశం..లక్ష్యం కూడా. ఈ దేశంలో కొలువు తీరిన మోదీ బీజేపీ ప్రభుత్వం పొద్దస్తమానం కులాలు, మతాలు, ప్రాంతాల పేరుతో చిచ్చు పెట్టేందుకు యత్నిస్తోందంటూ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు మంత్రి కేటీఆర్(KTR).
శనివారం అంబేద్కర్ యూనివర్శిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎవరి మతం వారిదే. ఎవరి అభిప్రాయాలు వారివే. ఈ దేశంలో అన్ని మతాల వారికి సమాన హక్కులు, ప్రాధాన్యతలు ఉన్నాయి.
ఒకరి మతం గొప్పదని మరో మతం చిన్నదని ఏ దేవుడు ఎక్కడా చెప్పలేదన్నారు. ప్రధానంగా కొట్టుకు చావండి అంటూ ఏమైనా బీజేపీ నేతలకు చెప్పాడా అని ప్రశ్నించారు కేటీఆర్(KTR).
అలా చెబితే ఏమైనా ఆనవాళ్లు ఉన్నాయో చూపండి అంటూ సవాల్ విసిరారు. తమ దృష్టిలో అంతా సమానమేనని పేర్కొన్నారు. దేశం అభివృద్ది చెందాలంటే కావాల్సింది ముందు చూపు. ప్రగతి పథంలో పయనించాలన్న తపన అని స్పష్టం చేశారు కేటీఆర్.
గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగాయి. వీటిపై చర్చకు రండి అని పలుసార్లు పిలుపు ఇచ్చా. కానీ ఇంత వరకు ఏ ఒక్క బీజేపీ నాయకుడు ముందుకు రాలేదని ఎద్దేవా చేశారు మంత్రి కేటీఆర్.
పేదలకు కనీస సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేయాలని మతాల పేరుతో చిచ్చు పెట్ట వద్దని కోరారు.
Also Read : బీజేపీ నిరక్షరాస్యుల పార్టీ – సిసోడియా
Which God told you to fight against each other ?
Minister @KTRTRS pic.twitter.com/r3QOs8zC65
— krishanKTRS (@krishanKTRS) August 27, 2022
In 8 Years , Modi’s Sarkar did not give even one single educational institution to Telangana
– Minister @KTRTRS pic.twitter.com/p9m0SGMQu2— krishanKTRS (@krishanKTRS) August 27, 2022