Manish Tiwari : గెల‌వ‌లేని వాళ్లు నీతులు చెబితే ఎలా

కాంగ్రెస్ ఎంపీ మ‌నీష్ తివారీ కామెంట్స్

Manish Tiwari : కాంగ్రెస్ ఎంపీ మ‌నీష్ తివారీ షాకింగ్ కామెంట్స్ చేశారు. క‌నీసం వార్డు ఎన్నిక‌ల్లో గెల‌వ‌లేని వారు రాబోయే ఎన్నిక‌ల్లో పార్టీ విజ‌యం గురించి మాట్లాడ‌టం విడ్డూరంగా ఉంద‌న్నారు.

శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. పోరాడే స‌త్తా లేని వాళ్లు అదేప‌నిగా కామెంట్స్ చేయ‌డం త‌న‌ను విస్తు పోయేలా చేసింద‌న్నారు.

రాహుల్ గాంధీపై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తూ కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ కేంద్ర మంత్రి గులాం న‌బీ ఆజాద్(Gulam Nabi Azad) ఐదు పేజీల లేఖ‌లో ఆరోపించారు.

తాను పార్టీ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అంతే కాదు రాహుల్ గాంధీ ఎప్పుడైతే పార్టీ బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత కాంగ్రెస్ పార్టీ స‌ర్వ నాశ‌న‌మైంద‌ని మండిప‌డ్డారు.

కాగా నిన్న‌టి దాకా చుల‌క‌న‌గా చూబ‌డిన వ్య‌క్తులు ఇప్పుడు న‌వ్వుతుంటార‌ని పేర్కొన్నారు. తాము తీవ్ర‌మైన ప‌రిస్థితుల్లో ఉన్నామ‌ని, ఇలా జ‌ర‌గ‌డం విచార‌క‌ర‌మ‌ని ఆవేద‌న చెందారు.

ఇది పార్టీకి తీర‌ని న‌ష్ట‌మ‌ని తెలిపారు. గులాం న‌బీ ఆజాద్ లేఖ లో ఏముంద‌నే దాని గురించి తాను కామెంట్స్ చేయ‌ద‌ల్చు కోలేద‌న్నారు. లేఖ‌లో చాలా విష‌యాలు ప్ర‌స్తావించారు.

ఇందులో కాద‌న‌డానికి లేద‌న్నారు మ‌నీష్ తివారీ. కాంగ్రెస్ పార్టీలో అస‌మ్మ‌తి స్వ‌రం వినిపించారు. జి23లో కీల‌క పాత్ర పోషించారు గులాం న‌బీ ఆజాద్.

ఈ అస‌మ్మ‌తి టీంలో ఎంపీ మ‌నీష్ తివారీ(Manish Tiwari) కూడా ఉన్నారు. పార్టీలో గ‌త కొన్నేళ్లుగా రెండు వ‌ర్గాలుగా చీలి పోయింద‌న్నారు. డిసెంబ‌ర్ 20, 2020న సోనియా గాంధీ నివాసంలో ఏకాభ్రిపాయం సాధించి ఉంటే ఇంత రాద్దాంతం జ‌రిగి ఉండేద‌న్నారు.

Also Read : ‘ఆజాద్’ చూపు ఎటు వైపు

Leave A Reply

Your Email Id will not be published!