Bandi Sanjay KCR : బండి భాష్యం సీఎంకు ఏం సంబంధం
నా కొడుకు కేసు నమోదు చేస్తారా
Bandi Sanjay KCR : భారతీయ జనతా పార్టీ చీఫ్ బండి సంజయ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చకు దారి తీసేలా చేశాయి. విచిత్రం ఏమిటంటే తన కొడుకు బండి భగరీథ చేసిన నిర్వాకం తల వంచుకునేలా చేసింది. మహీంద్రా యూనివర్శిటీ ఫిర్యాదు మేరకు దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేయడం కలకలం రేపింది.
తాను చదివే కాలేజీలో తోటి విద్యార్థిపై దారుణమైన రీతిలో దాడి చేయడం, బూతులు తిట్టిన వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ సమయంలో కావాలని తనను ఎదుర్కోలేక నాన్ బెయిల్ బుల్ కేసు నమోదు చేయించారంటూ ఆరోపించారు. కొడుక్కు తప్పు చేస్తే సరిదిద్దాల్సింది పోయి కేసీఆర్ ను(Bandi Sanjay KCR) టార్గెట్ చేయడంపై నెటిజన్లు సీరియస్ అయ్యారు.
బండి భగరీథ చేయి చేసుకోవడమే కాకుండా రాయలేని భాషలో తిట్టడం, చావ బాదడం ఆ వీడియోలో స్పష్టంగా కనిపించింది. భగరీథ తో పాటు అతడి మరో స్నేహితుడు దాడికి దిగడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ విషయం గురించి చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని, చంపుతానంటూ కూడా వార్నింగ్ ఇచ్చాడు.
తనను ఏమీ చేయలేరంటూ రెచ్చి పోయాడు బండి కొడుకు. ఈ మొత్తం వ్యవహారంలో బండి తనయుడు ఉన్నది వాస్తవం. బండి కొడుక్కి కేసీఆర్ కు ఏం సంబంధం అంటూ భారత రాష్ట్ర సమితి నేతలు ప్రశ్నిస్తున్నారు. యూనివర్శిటీ ఫిర్యాదు మేరకు బండి దశరథ్ పై ఐపీసీ 341, 323, 504, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
తప్పు చేస్తే సరెండర్ చేస్తా..కానీ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా అని ప్రశ్నించారు బండి సంజయ్. ఇదిలా ఉండగా మొదటి నుంచి వివాదాస్పదుడిగా ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి భగరీథపై.
Also Read : గుట్టలో సీఎంలు స్వామికి పూజలు