MK Stalin : ఏ నిర్ణ‌యం తీసుకున్నా ప్ర‌జ‌ల కోస‌మే – స్టాలిన్

న‌న్ను నియంతగా కొంద‌రు భావిస్తున్నారు

MK Stalin : త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. తాను అవినీతిని ఎట్టి ప‌రిస్థితుల్లో స‌హించ బోన‌ని మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. ఇప్ప‌టికే సీఎంగా కొలువు తీరిన స్టాలిన్(MK Stalin) కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు.

త‌న‌దైన పాల‌న‌తో ముందుకు వెళుతున్నారు. టోల్ ఫ్రీ నెంబ‌ర్ ఏర్పాటు చేశారు. క‌రోనా క‌ష్ట కాలంలో క‌ఠిన చ‌ర్య‌లు తీసుకున్నారు. త‌న సెక్యూరిటీని త‌గ్గించుకున్నారు. ఆయ‌న వినూత్న కార్య‌క్ర‌మాల‌కు శ్రీ‌కారం చుట్టారు.

వ‌ర‌ద‌ల స‌మ‌యంలో సైతం తానే ముందుండి న‌డిపించారు. అంతే కాదు రాష్ట్రంలో ఏ సీఎం తీసుకోని నిర్ణ‌యం తీసుకున్నారు. డీఎంకే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవ‌రైనా స‌రే త‌మ భోజ‌నం తామే తెచ్చుకోవాల‌ని ఆదేశించారు.

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఆవ‌ర‌ణ‌లో క్యాంటిన్ లోకి ఎవ‌రూ వెళ్ల కూడ‌ద‌ని సూచించారు. ఇదే స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ఇబ్బంది వ‌చ్చినా వెంట‌నే నేరుగా సీఎం ఆఫీసులో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబ‌ర్ కు ఫోన్ చేయాల‌ని సూచించారు.

మ‌రో వైపు త‌మిళ‌నాడు రాష్ట్రంలో రోడ్డు ర‌వాణా సంస్థ ఎలా ఉందో తానే ద‌గ్గ‌రుండి చూస్తున్నారు. ఊహించ‌ని రీతిలో సీఎం సామాన్యుడి లాగా ప్ర‌యాణం చేస్తూ విస్తు పోయేలా చేస్తున్నారు.

చెన్నైలోని బ‌స్సులో ప్ర‌యాణం చేసి సౌక‌ర్యాలు ఎలా ఉన్నాయంటూ ప్ర‌యాణికుల‌ను అడుగుతున్నారు. సోమ‌వారం కీల‌క వ్యాఖ్య‌లు చేశారు స్టాలిన్(MK Stalin) . తాను ప్ర‌జాస్వామ్య బ‌ద్దంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాన‌ని చెప్పారు.

ఎవ‌రైనా ఏది చేసినా ప్ర‌జాస్వామ్యం కాద‌ని, అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగితే నియంత‌లా చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని నా స‌న్నిహిత వ‌ర్గాలు అంటున్నాయ‌ని స్టాలిన్ కుండ బ‌ద్ద‌లు కొట్టారు. ప్ర‌స్తుతం స్టాలిన్ చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపాయి.

Also Read : మాకు స్వ‌యం ప్ర‌తిప‌త్తి కావాలి – రాజా

Leave A Reply

Your Email Id will not be published!