Sonia Gandhi : ఇందులో నా త‌ప్పేంటి – సోనియా గాంధీ

అధిర్ రంజ‌న్ చౌద‌రి కామెంట్స్ పై

Sonia Gandhi : పార్ల‌మెంట్ కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజ‌న్ చౌద‌రి రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ముపై చేసిన కామెంట్స్ తో ద‌ద్ద‌రిల్లింది. వాయిదా ప‌డింది. తిరిగి ప్రారంభ‌మైంది. భార‌తీయ జ‌న‌తా పార్టీ , కాంగ్రెస్ పార్టీ ఎంపీల మ‌ధ్య తీవ్ర వాగ్వాదానికి దారి తీసింది.

ఎంపీ అనుచిత కామెంట్స్ పై క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని కేంద్ర మంత్రులు , స‌భ్యులు డిమాండ్ చేశారు. ఈ సంద‌ర్భంగా కేంద్ర మంత్రులు స్మృతీ ఇరానీ, నిర్మ‌లా సీతారామ‌న్ నిప్పులు చెరిగారు.

ఆపై ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీ క్షమాప‌ణ చెప్పాల‌ని కోరారు. దీనిపై తీవ్రంగా స్పందించారు సోనియా గాంధీ. ఎవ‌రో ఏదో మాట్లాడితే తాను ఎందుకు రెస్పాండ్ కావాల‌ని ప్ర‌శ్నించారు.

దీంతో స్మృతీ ఇరానీ , సోనియా గాంధీకి మ‌ధ్య మాట‌ల యుద్దం న‌డించింది. చివ‌ర‌కు నువ్వా నేనా అన్నంత స్థాయి దాకా వెళ్లింది. ఈ సంద‌ర్భంగా సోనియా స్పందిస్తూ ఇందులో నా త‌ప్పేంటి అని నిల‌దీశారు.

ఇదే విష‌యం గురించి బీహార్ ఎంపీ ర‌మాదేవిని గాంధీ కోరిన‌ట్లు స‌మాచారం. అధిరి రంజ‌న్ చౌద‌రి రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్మును రాష్ట్ర‌ప‌త్ని అని పేర్కొన‌డం పార్లమెంట్ లో క‌ల‌కలం రేపింది.

దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నానికి దారి తీసింది. లోక్ స‌భ‌లో కాంగ్రెస్ నాయ‌కుడిగా అధిర్ రంజన్ చౌద‌రిని ఎన్నుకోవ‌డమే సోనియా గాంధీ(Sonia Gandhi) చేసిన అతి పెద్ద త‌ప్పు అని పేర్కొన‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఇదిలా ఉండ‌గా స్మృతీ ఇరానీ వైపు కోపంగా మాట్లాడిన‌ట్లు ఆరోపించారు బీజేపీ ఎంపీలు. కానీ దీనిని తీవ్రంగా ఖండించింది కాంగ్రెస్ పార్టీ. ఇదంతా రాజ‌కీయం త‌ప్ప మ‌రొక‌టి కాద‌న్నారు.

Also Read : రాష్ట్ర‌ప‌తికి చెబుతా వేరే వాళ్ల‌కు కాదు

 

Leave A Reply

Your Email Id will not be published!