Abhijt Bose Resign : వాట్సాప్ ఇండియా హెడ్ రాజీనామా
మెటా ఇండియా పబ్లిక్ పాలసీ హెడ్ కూడా
Abhijt Bose Resign : మార్క్ జుకర్ బర్గ్ సారథ్యంలోని మెటా (ఫేస్ బుక్ ) కు కోలుకోలేని షాక్ తగిలింది. మెటాకు చెందిన వాట్సాప్ ఇండియా హెడ్ తో పాటు మెటా ఇండయా పబ్లిక్ పాలసీ హెడ్ కూడా తమ పదవులకు రాజీనామా చేశారు. ఇది ఊహించని నిర్ణయం. ఇప్పటికే ఆర్థిక మాంద్యం కారణంగా 11 వేల మందిని సాంగనంపారు జుకర్ బర్గ్.
ఇక టెక్ దిగ్గజం తన అన్ని ప్లాట్ ఫారమ్ లలో భారత దేశంలోని మెటా పబ్లిక్ పాలసీ డైరెక్టర్ గా శివనాథ్ తుక్రాలను నియమించినట్లు ప్రకటించింది. ఇక ఇప్పటి వరకు మెటా ఇండియా హెడ్ గా ఉన్న అజిత్ మోహన్ తన ప్రత్యర్థి స్నాప్ లో మరో ఉద్యోగాన్ని స్వీకరించేందుకు రాజీనామా చేశారు ఇప్పటికే.
ఆయన రాజీనామా చేసిన రెండు వారాల తర్వాత పబ్లిక్ పాలసీ కోసం కంట్రీ లీడ్ రాజవ్ అగర్వాల్ ఇవాళ రాజీనామా చేసినట్లు సోషల్ మీడియా దిగ్గజం ధ్రువీకరించింది. వాట్సాప్ ఇండియా హెడ్ అభిజిత్ బోస్ కూడా రాజీనామా(Abhijt Bose Resign) చేసినట్లు మెటా అధికారికంగా ప్రకటించింది.
ఇక రాజీవ్ అగర్వాల్ మరో అవకాశాన్ని కొనసాగించేందుకు మెటాలో తన పాత్ర నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. భవిష్యత్తులో మంచి పొజిషన్ లోకి చేరుకోవాలని మెటా కోరింది. ఇక భారత దేశంలో వాట్సాప్ మొదటి హెడ్ గా అభిజిత్ బోస్ తన అద్భుతమైన సహకారాలు అందించినందుకు వాట్సాప్ హెడ్ వీల్ క్యాత్ కార్ట్ ధన్యవాదాలు తెలిపారు.
శివనాథ్ తుక్రాల్ ను నియమించినట్లు అధికారికంగా ప్రకటించింది.
Also Read : కాంట్రాక్టు ఉద్యోగులపై మస్క్ వేటు