Chirag Paswan : బీహార్ లో మ‌ద్య నిషేధం ఎక్క‌డ – పాశ్వాన్

సీఎం నితీశ్ కుమార్ కు సూటి ప్ర‌శ్న‌

Chirag Paswan : బీహార్ సీఎం నితీశ్ కుమార్ పై నిప్పులు చెరిగారు లోక్ జ‌న శ‌క్తి పార్టీ (రామ్ విలాస్ ) చీఫ్ చిరాగ్ పాశ్వాన్(Chirag Paswan). చ‌ట్టం ఎక్క‌డా అమ‌లు కావ‌డం లేద‌న్నారు. ఏప్రిల్ 2016 నుండి బీహార్ లో 10 సంవ‌త్స‌రాల జైలు శిక్ష‌తో పాటు మ‌ద్యాన్ని నిషేధించారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా ఓ వీడియోను కూడా పంచుకున్నారు. ఓ వ్య‌క్తి బ‌హిరంగంగా మ‌ద్యం స‌ర‌ఫ‌రా చేస్తున్న బైక్ పై వెళుతున్న దృశ్యం ఇందులో ఉంది.

17 ఏళ్ల సుదీర్ఘ అనుబంధాన్ని భార‌తీయ జ‌న‌తా పార్టీతో తెంచుకున్నారు నితీశ్ కుమార్(Nitish Kumar). తాజాగా ఆయ‌న జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో క‌లిపి మ‌హా ఘ‌ట్ బంధ‌న్ పేరుతో సంకీర్ణ స‌ర్కార్ ను ఏర్పాటు చేశారు.

31 మందితో కేబినెట్ కూడా ఏర్పాటు చేశారు. కొత్త‌గా కొలువు తీరాక తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నారు. ఇప్ప‌టికే ఇండియ‌న్ పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్ ప్ర‌శాంత్ కిషోర్ ఏకంగా మోదీతో నితీశ్ కుమార్ దిగిన ఫోటోల‌ను పంచుకున్నారు.

ఈ త‌రుణంలో పీకేతో పాటు ఆర్సీపీ సింగ్ స‌ర‌స‌న ఇప్పుడు చిరాగ్ పాశ్వాన్(Chirag Paswan) చేరారు. ఎవ‌రూ వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. సీఎం నితీశ్ కుమార్ ను ప్ర‌ధానంగా ల‌క్ష్యంగా చేసుకుని విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు గుప్పిస్తున్నారు. మ‌ద్యాన్ని అరిక‌ట్ట‌డంలో సీఎంతో పాటు ఇత‌ర ప్ర‌భుత్వ యంత్రాంగం విఫ‌ల‌మైంద‌ని ఆరోపించారు చిరాగ్ పాశ్వాన్ .

ఇదే స‌మ‌యంలో ఇంత విచ్చ‌ల‌విడిగా మ‌ద్యం అమ్ముతుంటే పోలీసులు నిద్ర పోతున్నారా అని ప్ర‌శ్నించారు. పోలీసులు విఫ‌ల‌మైన చోట జ‌న‌తా రాజ్ ఎలా ఉంటార‌ని ప్ర‌శ్నించారు సీఎంను.

Also Read : స‌చిన్ పైలట్ పై చందానా సీరియ‌స్

Leave A Reply

Your Email Id will not be published!