OPS vs EPS : తమిళనాడు అన్నాడీఎంకేలో ఆధిపత్య పోరు ముదిరి పాకాన పడింది. నువ్వా నేనా అంటూ మాజీ సీఎం ఎడాపాడి పళని స్వామి, మాజీ డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం(OPS vs EPS) మధ్య మాటల యుద్దం నుంచి కోర్టు మెట్లు ఎక్కేంత దాకా చోటు చేసుకుంది.
అన్నాడీఎంకే పార్టీకి తానే సుప్రీం అంటూ ఇద్దరూ బల ప్రదర్శనకు సైతం దిగుతున్నారు. దీంతో ఇవాళ సోమవారం కీలక తీర్పు ప్రకటించనుంది హైకోర్టు.
అంత వరకు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పార్టీ దివంగత నాయకురాలు, మాజీ సీఎం కుమారి జయలలిత రాజకీయ వారసుడిగా ఓపీఎస్ ను భావించేవారు. కాగా ఈపీఎస్ కు పార్టీ కార్యకర్తల నుంచి భారీ మద్దతు లభించడం విశేషం.
ఇక పార్టీ కీలక సమావేశం ప్రారంభం కావాల్సి ఉంది. అంతకు ముందే కోర్టు తన తుది తీర్పు వెలువరించనుంది. మరో వైపు బహిష్కృత నాయకురాలు వీకే శశికళ అసలు వీళ్లకు అర్హత లేదంటూ తానే అసలైన జయలలిత వారసురాలినంటూ ప్రకటించారు.
ఎలాంటి ప్రకటన వస్తుందనే దానిపై టెన్షన్ నెలకొంది ఇరు నేతల వర్గీయుల్లో. ఇద్దరు అగ్ర నేతలు పార్టీపై నియంత్రణ కోసం మల్లగుల్లాలు పడుతున్నారు.
చివరకు సుప్రీంకోర్టు దాకా వెళ్లింది వీరి వ్యవహారం. పార్టీ భవిష్యత్తును నిర్ణయించే కీలకమైన పార్టీ సమావేశాన్ని నిలిపి వేయాలంటూ అన్నాడీఎంకే అగ్ర నేత ఓ పన్నీర్ సెల్వం (ఓపీఎస్ ) చేసిన విజ్ఞప్తిపై మద్రాస్ హైకోర్టు తన ఉత్తర్వును ప్రకటింనుంది.
ఇక ఓపీఎస్ కంటే తనకే పవర్ ఉందని, తనకు అప్పగించాలంటూ ఎడప్పాడి కె పళనిస్వామి(కేపీఎస్) వాదిస్తున్నారు.
Also Read : మైఖేల్ లోబోను తొలగించిన కాంగ్రెస్