Veerendra Heggade : ఎవరీ వీరేంద్ర హెగ్గడే ఏమిటా కథ
ప్రధాని మోదీ మెచ్చుకున్న వ్యక్తి
Veerendra Heggade : దేశ వ్యాప్తంగా ఎవరీ వీరేంద్ర హెగ్గడే అనే చర్చ మొదలైంది. ఎందుకంటే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా ఆయన పేరు ప్రస్తావించారు.
అంతే కాదు తానే దగ్గరుండి రాజ్యసభ (పెద్దల సభ) కు నామినేట్ చేశారు. వీరేంద్ర హెగ్గడేది(Veerendra Heggade) కర్ణాటక. ధర్మస్థల మంజునాథేశ్వర ఆలయానికి చెందిన వారు. ఈ ఆలయానికి హేగ్గడే ధర్మాధికారిగా ఉన్నారు.
ఇదిలా ఉండగా మంజునాథేశ్వరుని తో సహా అనేక దేవాలయాలను నియంత్రించే ట్రస్ట్ . ఇది కర్ణాటకలోని ధర్మస్థలలో ఉంది. డాక్టర్ వీరేంద్ర హెగ్గడే ధర్మాధికారి మాత్రమే కాదు డాక్టర్ , సంస్కర్త, విద్యావేత్త, తత్వవేత్త, పరోపకారి గా పేరొందారు.
సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అభివృద్దిలో వీరేంద్ర హెగ్గడే గత 48 సంవత్సరాలుగా తన వంతు కృషి చేస్తూ వస్తున్నారు. 2015లో హెగ్గడేకు భారత దేశంలోనే అత్యున్నతమైన పురస్కారాలలో భావించే పద్మ విభూషణ్ లభించింది.
హెగ్గడే 1968లో 20 ఏళ్ల వయస్సులో ధర్మాధికారి అయ్యాడు. బహుముఖ వ్యక్తిత్వం కలిగిన ఆయన సదరు సంస్థ ద్వారా విస్తృతంగా కార్యక్రమాలు చేపడతారు.
ఆపై ధర్మాధికారిగా వాటిని నియంత్రిస్తారు. ఆధునిక ధర్మస్థల రూపశిల్పి అని కూడా పిలుస్తారు. ఇక మంజునాథ స్వామి ఆలయ ప్రధాన అర్చకుడిగా సమాజ శ్రేయస్సు కోసం అనేక విశిష్ట కార్యక్రమాలను చేపట్టారు.
నాణ్యమైన విద్య కోసం ఎస్డీఎం ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించారు. సామూహిక వివాహాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
గ్రామీణాభివృద్ది స్వయం ఉపాధి శిక్షణ సంస్థ, శ్రీ ధర్మస్థల మంజునాథేశ్వర మెడికల్ ట్రస్ట్ , శ్రీ ధర్మస్థల మంజునాథేశ్వర ధర్మోతన ట్రస్ ఉన్నాయి.
Also Read : ఐఎంఎఫ్ లో దిగ్గజాల సరసన గీతా గోపీనాథ్