S Jai Shankar : ప్ర‌ధాని మోదీ వైపు ప్ర‌పంచం చూపు

కేంద్ర మంత్రి సుబ్ర‌మ‌ణ్యం జై శంక‌ర్

S Jai Shankar : యావ‌త్ ప్ర‌పంచం విస్తు పోయేలా ప్ర‌ధాని నరేంద్ర మోదీ అద్భుత‌మైన పాల‌న సాగిస్తున్నార‌ని స్ప‌ష్టం చేశారు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి నరేంద్ర దామోద‌ర దాస్ మోదీ. నాయ‌క‌త్వ నైపుణ్యం , స‌మ్మిళిత‌మైన అభివృద్ది, సంక్షేమ ఫ‌లాలు ప్ర‌తి ఒక్క‌రికి అందేలా చేయ‌డంలో పీఎం కీల‌క పాత్ర పోషిస్తూ వ‌చ్చార‌ని స్ప‌ష్టం చేశారు జై శంక‌ర్(S Jai Shankar) .

గాడి త‌ప్పిన ప్ర‌పంచాన్ని తీర్చిదిద్దేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ కితాబు ఇచ్చారు. ప్ర‌భుత్వం ప్ర‌జా సంక్షేమ‌మే ల‌క్ష్యంగా ప‌ని చేస్తోంద‌ని చెప్పారు. రాబోయే త‌రాల‌కు మేలు చేకూర్చేలా ప్ర‌య‌త్నిస్తోంద‌న్నారు సుబ్ర‌మ‌ణ్యం జై శంక‌ర్. ప‌లు దేశాల‌కు చెందిన అధినేత‌లు మోదీ ప‌నితీరును మెచ్చుకుంటున్నార‌ని చెప్పారు.

వ‌చ్చే ఏడాది లేదా ప‌దవీ కాలం గురించి ఆలోచించ వ‌ద్ద‌ని రాబోయే 25 ఏళ్ల గురించి ఆలోచించాల‌ని ప్ర‌ధాని మోదీ త‌న మంత్రుల‌ను కోరార‌ని తెలిపారు . అహ్మదాబాద్ లో మోదీస్ ఇండియా రైజింగ్ ప‌వ‌ర్ అనే అంశంపై కేంద్ర మంత్రి ప్ర‌సంగించారు. గ‌తంలో పాల‌కులు త‌మ బాగు కోసం మాత్ర‌మే ప‌ని చేశాయ‌ని కానీ తాము దేశం పురోగ‌తి ధ్యేయంగా ప‌ని చేస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు సుబ్ర‌మ‌ణ్యం జై శంక‌ర్.

Also Read : CM Yogi Adityanath

Leave A Reply

Your Email Id will not be published!