Joe Biden : క్వీన్ అంత్యక్రియలకు హాజరవుతా- బైడెన్
యావత్ ప్రపంచం రాణికి సంతాపం
Joe Biden : సుదీర్ఘ కాలం పాటు గ్రేట్ బ్రిటన్ (యుకె) దేశానికి రాణిగా ఉన్న క్వీన్ ఎలిజబెత్ 96 ఏళ్ల వయస్సులో కన్ను మూశారు. ఆమె మరణంతో యావత్ ప్రపంచ వ్యాప్తంగా సంతాపం వ్యక్తం అవుతోంది.
పలువురు దేశాధినేతలు క్వీన్ అంత్యక్రియలకు హాజరు కానున్నారు. తాజాగా అమెరికా దేశ అధ్యక్షుడు జోసెఫ్ బైడెన్(Joe Biden) బ్రిటన్ కు వెళ్లనున్నారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో క్వీన్ ఎలిజబెత్ కు అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
ఇప్పటికే ఆయా దేశాలకు చెందిన అధ్యక్షులు, ప్రధానమంత్రులు హాజరు కానుండడంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఇప్పటి వరకు ఇంకా అంత్యక్రియలు నిర్వహించే తేదీని యుకె సర్కార్ నిర్ణయించ లేదు.
సెప్టెంబర్ 19న లండన్ లో జరుగుతుందని భావిస్తున్నారు. తాను అంత్యక్రియలకు హాజరు కానున్నట్లు స్వయంగా ప్రకటించారు అమెరికా చీఫ్ జోసెఫ్ బైడెన్.
అయితే క్వీన్ ఎలిజబెత్ కు సంబంధించి తేదీ తెలియదని, తనకు ఇంకా సమాచారం ఆ దేశం నుంచి రాలేదని చెప్పారు. తప్పనిసరిగా తాను హాజరు కానున్నట్లు స్పష్టం చేశారు అమెరికా అధ్యక్షుడు.
ఈ విషయాన్ని ఆయన మీడియాతో వెల్లడించారు. రాణి కుమారుడు కింగ్ చార్లెస్ -3 తో ఇంకా మాట్లాడ లేదని చెప్పారు. అతడు స్వయంగా తనకు తెలుసునని స్పష్టం చేశారు బైడెన్. ఈ విషయం గురించి తాను కాల్ చేస్తానని వెల్లడించాడు.
ఇదిలా ఉండగా ఒహియో లోని కొలంబస్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ఎయిర్ ఫోర్స్ వన్ ఎక్కే ముందు బైడెన్ మాట్లాడారు.
Also Read : ఎలిజబెత్ జీవితం అజరామరం – చార్లెస్