Prashant Kishor : నితీష్ కుమార్ కోసం పని చేయను – పీకే
నిప్పులు చెరిగిన ఐపాక్ చీఫ్
Prashant Kishor : ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన జేడీయూ చీఫ్ , బీహార్ సీఎం నితీశ్ కుమార్ ను టార్గెట్ చేశారు. ఆయన గత కొంత కాలం నుంచి నితీశ్ పై నిప్పులు చెరుగుతూ వస్తున్నారు.
ఇదిలా ఉండగా జేడీయూ పీకేపై మండిపడింది. తను రాజకీయ వ్యూహకర్తగా కాకుండా కేవలం భారతీయ జనతా పార్టీ కోసం పని చేస్తున్నారంటూ ఆరోపించింది.
కేవలం తన ప్రయోజనాల కోసం మాత్రమే ఒప్పందాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై తీవ్రంగా ప్రతిస్పందించారు ప్రశాంత్ కిషోర్.
జేడీయూ పార్టీ చీఫ్ గా ఉంటూ నడిపించాలని కోరుతూ నితీశ్ కుమార్(Nitish Kumar) కోరారని కానీ తాను తిరస్కరించానని చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లో ఓటమి పాలయ్యాక ఢిల్లీలో తనను సీఎం కలిశారని తెలిపారు.
ఇది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఎవరు ఎవరిపై ఆధారపడ్డారో ప్రజలు తెలుసన్నారు. అయితే సీఎం పోస్టుపై నితీశ్ కుమార్ కు ఉన్నంత శ్రద్ద బీహార్ రాష్ట్ర ప్రజలపై లేదన్నారు.
ఆయన రాష్ట్రంలో అధికారం కోసం అప్రవిత పొత్తు పెట్టుకున్నారంటూ ఆరోపించారు ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) . ఒకనాడు జేడీయూలో చేరినంత మాత్రాన తాను జీవితాంతం లొంగి ఉండాలన్న రూల్ ఏమీ లేదన్నారు.
తన రాజకీయ వారసుడిగా చేసినా లేదా సీఎం కుర్చీ ఇచ్చినా తాను ఒప్పుకోనన్నారు. ఇదిలా ఉండగా ఐపాక్ చీఫ్ ప్రశాంత్ కిషోర్ రాష్ట్రంలో 3,500 కిలోమీటర్ల జన్ సురా యాత్ర చేపట్టారు.
పశ్చిమ చంపారన్ జిల్లాలోని జమునియా గ్రామంలో జరిగిన సభలో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read : భారత్ జోడో యాత్రలో సోనియా గాంధీ