Women Coach Sandeep Singh : మౌనంగా ఉంటే కోటి ఆఫర్ – కోచ్
Women Coach Sandeep Singh : హర్యానా క్రీడా శాఖ మంత్రి సందీప్ సింగ్ పై తీవ్ర ఆరోపణలు చేసిన మహిళా కోచ్ మరోసారి నిప్పులు చెరిగారు. తనను విచారణ సందర్బంగా మౌనంగా ఉండమని ఒత్తిడి తెస్తున్నారని, రూ కోటి కూడా ఆఫర్ చేశారని, విదేశాలకు వెళ్లేందుకు కూడా ఏర్పాట్లు చేస్తామంటూ ఆఫర్లు కూడా ఇస్తున్నారని ఆరోపణలు చేసింది.
పలువురు తనకు ఫోన్ కాల్స్ చేశారంటూ వాపోయింది. ప్రస్తుతం మహిళా కోచ్ చేసిన కామెంట్స్ హర్యానాలో కల్లోలం రేపాయి. ఇప్పటికే నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేశారు సందీప్ సింగ్(Women Coach Sandeep Singh). గతంలో భారత హాకీ జట్టుకు కెప్టెన్ గా ఉన్నాడు. 2019లో భారతీయ జనతా పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించాడు.
మనోహర్ లాల్ ఖట్టర్ కేబినెట్ లో క్రీడా శాఖ మంత్రి గా పదవీ బాధ్యతలు చేపట్టారు సందీప్ సింగ్. సీఎం ఖట్టర్ దర్యాప్తును ప్రభావితం చేసేందుకు యత్నిస్తున్నారంటూ ఆరోపించారు మహిళా కోచ్. ఇదిలా ఉండగా చండీగఢ్ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్ ) ముందు హాజరయ్యారు.
అనంతరం బాధిత మహిళా కోచ్ మీడియాతో మాట్లాడారు. సిట్ ఏర్పాటు చేశారు. నాకు జరిగిన ఇబ్బంది గురించి కూలంకుశంగా వివరించా. ఈ సమయంలో కాపాడాల్సిన సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ మంత్రిని రక్షించే ప్రయత్నంలో ఉన్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. సీఎం కావాలని కేసును నీరుగార్చేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు బాధిత మహిళా కోచ్.
Also Read : కటీల్ కామెంట్స్ డీకేఎస్ సీరియస్