KTR : మ‌హిళ‌లు పారిశ్రామిక‌వేత్త‌లుగా ఎద‌గాలి 

రాణించాల‌ని కోరిన కేటీఆర్

KTR : మ‌హిళా పారిశ్రామికవేత్త‌ల‌కు గుడ్ న్యూస్ చెప్పారు కేటీఆర్. రాష్ట్రంలోని మ‌హిళా పారిశ్రామిక పార్కుల్లో 10 శాతం పెట్టుబ‌డి రాయితీ క‌ల్పిస్తామ‌ని ప్ర‌క‌టించారు. మ‌హిళా పారిశ్రామిక‌వేత్త‌ల‌కు ప్ర‌భుత్వం అన్ని ర‌కాలుగా తోడ్పాటు అంద‌జేస్తుంద‌న్నారు.

అంత‌ర్జాతీయ విమెన్స్ డే సంద‌ర్బంగా సుల్తాన్ పూర్ లో మ‌హిళా పార్కును ఆయ‌న ప్రారంభించారు. అనంత‌రం ఏర్పాటు చేసిన స‌మావేశంలో కేటీఆర్(KTR )ప్ర‌సంగించారు.

కేవ‌లం మ‌హిళ‌ల కోసం ఏర్పాటైన ఏకైక కేంద్రం వీ హబ్ అని చెప్పారు. ఈ వీ హ‌బ్ కు దీప్తి సిఇఓగా ఉన్నార‌ని తెలిపారు. వీ హ‌బ్ ను సంద‌ర్శించి మ‌హిళ‌లు పారిశ్రామిక‌వేత్త‌లుగా ఎదగాల‌ని పిలుపునిచ్చారు.

వీ హ‌బ్ ఇప్ప‌టికే 2 వేల 194 అంకురాల‌కు రూప‌క‌ల్ప‌న చేసింద‌ని వెల్ల‌డించారు. ఇందు కోసం రూ. 66.3 కోట్ల నిధులు కేటాయించ‌డం జ‌రిగింద‌ని స్ప‌ష్టం చేశారు. స్టార్ట‌ప్ నిధుల‌తో 2 వేల 800 మందికి ఉపాధి క‌ల్పించ‌డం జ‌రిగిందన్నారు మంత్రి కేటీఆర్(KTR ).

దేశంలోనే ఎక్క‌డా లేని విధంగా రాష్ట్రంలో కేవ‌లం మ‌హిళ‌ల కోసం ఉద్యామిక అనే కొత్త కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టామ‌న్నారు. దీని ద్వారా మ‌హిళా పారిశ్రామిక‌వేత్త‌ల‌కు అవకాశాలు క‌ల్పిస్తున్న‌ట్లు తెలిపారు.

ఇందు కోసం ప్ర‌త్యేకించి సంప్ర‌దింపుల క‌మిటీ ఏర్పాటు చేశామ‌న్నారు. ప్రాసెస్ , రివ్యూ , ఆర్థిక ప్రోత్సాహ‌కాలు కూడా అంద‌జేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు కేటీఆర్.

అంతే కాకుండా టీఎస్ ఐ పాస్ ద్వారా ప‌రిశ్ర‌మలు ఏర్పాటు చేయాల‌ని అనుకునే వారికి కేవ‌లం 15 రోజుల్లోనే ప‌ర్మిష‌న్ ఇస్తున్నామ‌ని చెప్పారు మంత్రి.

హైద‌రాబాద్ ఐటీ హ‌బ్, వీ హ‌బ్, ఫార్మా హ‌బ్, అగ్రి హ‌బ్ గా మారింద‌న్నారు.

Leave A Reply

Your Email Id will not be published!