Wrestlers Protest : రైతులతో కలిసి రెజ్లర్ల సమావేశం
కేంద్రంపై ప్రత్యక్ష యుద్దానికి సిద్దం
Wrestlers Protest : భారత రెజ్లర్ల సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ మహిళా రెజ్లర్లు(Wrestlers) డిమాండ్ చేస్తున్నారు. లైంగిక, శారీరక, మానసిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. గత ఏప్రిల్ 23న నిరసన దీక్షకు దిగారు. ఈనెల 28న ఆదివారం నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం సందర్భంగా మహిళా పంచాయత్ పేరుతో మార్చ్ చేపట్టాలని నిర్ణయించారు. భవనానికి 2 కిలో మీటర్ల దూరంలో ఉండగా ఢిల్లీ పోలీసులు దాడికి దిగారు. మహిళా రెజ్లర్లు(Wrestlers) అని చూడకుండా అసభ్యకర ప్రవర్తన చేయడం కలకలం రేపింది. దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఖాకీల దాష్టీకంపై విపక్షాలు సైతం భగ్గుమన్నాయి.
ఇదే సమయంలో మహిళా రెజ్లర్లపై దాడికి దిగిన ఢిల్లీ పోలీసులు తిరిగి వారిపైనే కేసులు నమోదు చేయడం తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. దీంతో తాము సాధించిన పతకాలకు విలువే లేదంటూ ఆవేదన చెందారు. ఆపై హరిద్వార్ కు బయలు దేరారు. గంగలో పతకాలను నిమజ్జనం చేస్తామని ప్రకటించారు. దీంతో గత కొంత కాలం నుంచి మహిళా రెజ్లర్ల ఆందోళనకు సంపూర్ణ మద్దతు తెలిపారు సంయుక్త కిసాన్ మోర్చా అగ్ర నేత రాకేశ్ టికాయత్.
ఇదే సమయంలో ఎస్కేఎఫ్ అగ్ర నేత నరేష్ టికాయత్ హరిద్వార్ కు బయలు దేరారు. పతకాలు గంగలో నిమజ్జనం చేయొద్దంటూ కోరారు. మహిళా రెజ్లర్లను సముదాయించారు. అంతే కాక కేంద్రానికి ఐదు రోజుల గడువు విధించారు. డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా కార్యాచరణ ప్రణాళిక ను ప్రకటించారు. ఇందుకు గాను జూన్ 1న గురువారం ముజఫర్ నగర్ జిల్లాలోని సౌరం పట్టణంలో ప్రధాన సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
Also Read : Rahul Gandhi