NCW Summons : మాజీ ఎంపీకి మహిళా కమిషన్ సమన్లు
ఆదివాసీలపై కాంగ్రెస్ తీరు బాధాకరం
NCW Summons : భారత దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్ నాయకుడు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. మహిళా ప్యానెల్ ఏకంగా సదరు నాయకుడికి సమన్లు(NCW Summons) జారీ చేసింది. ఇదిలా ఉండగా మరో వైపు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర కాంగ్రెస్ నాయకుడు ఉదిత్ రాజ్ చేసిన వ్యాఖ్యలను కొట్టి పారేశారు.
ఈ కామెంట్స్ కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ వ్యతిరేక మనస్తత్వాన్ని తెలియ చేస్తోందన్నారు. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ముపై చేసిన వ్యాఖ్యలకు గాను అక్టోబర్ 10న తన ముందు హాజరు కావాలని కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉదిత్ రాజ్ కి జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) గురువారం నోటీసులు జారీ చేసింది.
కాగా నిన్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆమె అధ్యక్షురాలిగా వ్యవహరించడం లేదని కేవలం చంచాగిరి చేస్తోందంటూ సంచలన ఆరోపణలు గుప్పించారు. దేశ వ్యాప్తంగా ఉదిత్ రాజ్ చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. దేశమంతటా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది.
దీనిని సుమోటోగా స్వీకరించింది జాతీయ మహిళా కమిషన్. ఆయన చేసిన ప్రకటన కేవలం మహిళకు మాత్రమే కాకుండా రాజ్యాంగ బద్దమైన ప్రభుత్వాధినేతకు వ్యతిరేకంగా ఉంది.
మహిళ అయినందుకే ఆమెను టార్గెట్ చేశారా. మాజీ ఎంపీ చేసిన కామెంట్స పూర్తిగా ఖండించదగినవి. నోటీసులు కూడా జారీ చేశాం. ఉపయోగించిన భాష అత్యంత అవమానకరమైనదని పేర్కొంది కమిషన్.
మాజీ ఎంపీ అయి ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని కమిషన్ పేర్కొంది.
Also Read : డ్రగ్ మాఫియాపై ఉక్కుపాదం – విజయన్