Muttagiri Yadagiri Reddy : ఎమ్మెల్యే కోసం మహిళ కంటతడి
తనకు టికెట్ రాదని బావురుమంది
Muttagiri Yadagiri Reddy : జనగాం ఎమ్మెల్యే ముత్తగిరి యాదగిరి రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. ఆయన మీడియాతో మాట్లాడుతుండగా ఓ మహిళ తనను పట్టుకుని ఏడ్చింది. తనకు టికెట్ రాదంటూ కొందరు ప్రచారం చేస్తున్నారంటూ వాపోయింది. అయ్యో ముత్తిరెడ్డి నీకు టికెట్ రాక పోతే ఎట్లా అంటూ కన్నీటి పర్యంతమైంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.
Muttagiri Yadagiri Reddy Viral
ఇదిలా ఉండగా జనగాంలో ముత్తిగిరి యాదగిరి రెడ్డి(Muttagiri Yadagiri Reddy) విచిత్రంగా భూ కబ్జాలకు పాల్పడ్డాడంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయాన్ని బయటి వాళ్లు కాదు ఏకంగా స్వంత బిడ్డనే ఆరోపణలు చేసింది. తన తండ్రి కబ్జాకోరు అంటూ , బాధితుల నుంచి గుంజుకున్న స్థలాన్ని తానే తొలగించే ప్రయత్నం చేసింది. దీనిపై ఎమ్మెల్యే వాపోయారు. తన బిడ్డ అమాయకురాలని, ఆమెను ఎవరో వెనుక నుండి ప్రోత్సహిస్తున్నారంటూ ఆరోపించారు.
మొత్తంగా ముత్తగిరి యాద గిరి రెడ్డి బీఆర్ఎస్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. తాజాగా బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ తొలి అభ్యర్థుల జాబితా ప్రకటించేందుకు కసరత్తు మొదలు పెట్టారు. ఇవాళా లేదా రేపో పూర్తి లిస్టును ప్రకటించే ఛాన్స్ ఉంది. ఈ తరుణంలో ఆయా ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా టికెట్లు ఇస్తానంటూ ప్రకటించడంతో యాదగిరి రెడ్డి వ్యతిరేకీయులు ఆయనకు టికెట్ రాదంటూ ప్రచారం చేశారు. దీంతో ఆయన అభిమాని అయిన ఓ మహిళ బావురుమంది.
Also Read : Ayutha Chandi Yagam : కమనీయం కళ్యాణోత్సవం