AP CM YS Jagan : కార్యకర్తలే పార్టీకి బలం – జగన్
గడప గడప కార్యక్రమం ముఖ్యం
AP CM YS Jagan : రాబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించారు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(AP CM YS Jagan). మంత్రులు, ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేశారు. ప్రతి ఒక్కరు నియోజకవర్గాలను జల్లెడ పట్టాలని ఆదేశించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం సీట్లు గెలవాలని ఆ దిశగా ప్రయత్నం చేయాలని స్పష్టం చేశారు.
ప్రతి రోజూ రాష్ట్రంలోని ఒక్కో నియోజకవర్గంపై సమీక్ష చేపడుతున్నారు. ఆయా నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి , అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలతో పాటు ఇంకా ప్రజలకు ఏం అందలేదో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తానే దగ్గరుండి ప్లస్ లు మైనస్ లు గుర్తిస్తూ పార్టీ బాధ్యులను అప్రమత్తం చేస్తుండడంతో ఎమ్మెల్యేలు అలర్ట్ అయ్యారు.
ఇక పార్టీకి ప్రధాన బలం కార్యకర్తలేనని వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసు కోవాల్సిన బాధ్యత మీ అందరిపై ఉందని స్పష్టం చేశారు ఏపీ సీఎం జగన్ రెడ్డి. వచ్చే 18 నెలలు అత్యంత కీలకమని మొత్తం 175 స్థానాల్లో వైఎస్సార్సీపీ జెండా ఎగుర వేయాలని పిలుపునిచ్చారు. క్లీన్ స్వీప్ చేస్తే ప్రతి ఒక్కరికీ తగిన రీతిలో గుర్తింపు ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు .
సీఎం ఆదేశాల మేరకు మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, చైర్మన్లు, వివిధ హోదాలలో ఉన్న వారంతా పూర్తిగా తమ తమ నియోజకవర్గాలలో పాగా వేశారు. ఇప్పటి నుంచే ప్రజలను కలుసుకునే పనిలో పడ్డారు. వార్డుల నుంచి ఎమ్మెల్యేల వరకు ప్రతి ఒక్కరితో ముచ్చటిస్తూ వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటున్నారు జగన్ రెడ్డి(AP CM YS Jagan).
గడప గడపకు కార్యక్రమంలో వచ్చే సమస్యల పరిష్కారంపై ఫోకస్ పెట్టాలని ఆదేశించారు.
Also Read : సీఎం కేసీఆర్ పై కృష్ణయ్య కన్నెర్ర