Visas Indians : భారతీయుల వీసాల జారీకి మోక్షం
కెనడియన్ హై కమిషనర్ వెల్లడి
Visas Indians : భారతీయులు వీసాల కోసం వేచి చూస్తున్నారు. రోజు రోజుకు ఆలస్యం కావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిస్థితిని గమనించిన కెనడా హై కమిషన్ రంగంలోకి దిగింది.
ఈ మేరకు త్వరితగతిన వీసాలు ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు కెనడియన్ హై కమిషనర్ వెల్లడించారు. వీసాల జారీ పై కీలక ప్రకటన చేశారు. ప్రతి వారం వేలాది మంది భారతీయ విద్యార్థులు తమ వీసాలు(Visas Indians) పొందుతున్నారని చెప్పారు.
కాగా వీసాల కోసం వేచి ఉండే సమయాన్ని తగ్గించేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. ఇదిలా ఉండగా భారత దేశం నుంచి అత్యధికంగా చదువుకునేందుకు వెళ్లే ప్రధాన నగరాలలో కెనడా టాప్ ప్లేస్ లో ఉంది.
దీంతో అక్కడికి వెళ్లాలంటే వీసాలు ఉండాల్సిందే. విద్యార్థులు, ఇతరుల ఇబ్బందులను తాము అర్థం చేసుకున్నామని తెలిపారు హై కమిషనర్. ఇందులో భాగంగా సాద్యమైనంత మేరకు త్వరగా వీసాలు ఇచ్చేలా చూస్తున్నామన్నారు.
వేచి ఉండే సమయాన్ని తగ్గించేందుకు కృషి చేస్తున్నట్లు స్పష్టం చేశారు. కాగా వీసాల జారీకి సంబంధించి దరఖాస్తు చేసుకున్న వారంతా ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని కోరారు.
పరిశీలించడం, జారీ చేయడంలోనే కొంత ఇబ్బంది ఎదురవుతుందన్నారు. దీనిని అర్థం చేసుకుని సహకరించాలని సూచించారు.
కాగా ప్రతి వారం వేలాది మంది భారతీయ విద్యార్థులకు వీసాలు మంజూరు చేస్తున్నామని పేర్కొన్నారు కెనడియన్ హై కమిషనర్.
టికెట్లు ఇచ్చినంత సులభంగా వీసాలు ఇవ్వడం కుదరదన్న విషయాన్ని అర్థం చేసుకోవాలని కోరారు. స్టడీ పర్మిట్లతో సహా ఏడాది పొడవునా దరఖాస్తులను ప్రాసెస్ చేస్తున్నామన్నారు.
Also Read : జన్మాష్టమి వేడుకల్లో రిషి సునక్