World Post Day 2022 : ప్రపంచమంతా తపాలా దినోత్సవం
ఘనమైన చరిత్రకు దర్పణం
World Post Day 2022 : ప్రతి ఏటా అక్టోబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా తపాలా దినోత్సవాన్ని(World Post Day 2022) జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇవాళ వరల్డ్ వైడ్ గా పోస్టల్ డేను నిర్వహిస్తున్నారు.
150 కంటే ఎక్కువ దేశాలు ప్రపంచ తపాలా దినోత్సవాన్ని వివిధ మార్గాల్లో జరుపుకుంటున్నాయి. తపాలా సేవలు ప్రాచీన కాలం నుండి కొనసాగుతూ వస్తున్నాయి.
ప్రస్తుతం టెక్నాలజీ మారినా ఇంకా సేవలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంటర్నెట్, ఇన్ స్టంట్ మెసేజింగ్ సేవల యుగంలో పోస్టల్ సేవలు కొంచెం పాతవిగా కనిపిస్తాయి. ప్రధానంగా ముఖ్యంగా డిజిటల్ పాదముద్ర లేని ప్రదేశాలలో పోస్టల్ వ్యవస్థ అనేది కీలకమైన పాత్ర పోషిస్తూ వస్తోంది.
ప్రతి ఏటా 9న ప్రపంచ తపాలా దినోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. 1874లో స్విట్జర్లాండ్ లోని బెర్న్ లో యూనివర్శిల్ పోస్టల్ యూనియన్ (యూపీయు) స్థాపన వార్షికోత్సవం ప్రపంచ తపాలా దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ఇవాళ కొరియర్ వ్యవస్థ ప్రపంచమంతటా విస్తరించింది.
పూర్వ కాలంలో గుర్రాలు, పావురాల ద్వారా సందేశాలను, లేఖలను చేర వేసే వారు. 1600లలో వివిధ దేశాలలో ఆవిర్భవించి వ్యాప్తం చెందడం ప్రారంభించాయి. 1800ల చివరలో అక్షరాల మార్పిడి నెమ్మదిగా పెరగడంతో ప్రపంచ వ్యాప్తంగా తపాలా వ్యవస్థ ఉద్భవించింది.
1874లో యుపీయూ స్థాపించాక ఇది మరింత పాపులర్ అయ్యింది. ఒక దేశానికి సంబంధించిన సామాజిక, ఆర్థిక వృద్ధికి దాని అపారమైన సహకారానికి మద్దతు ఇచ్చేందుకు దీనిని నిర్వహిస్తూ వస్తున్నారు. తపాలా దినోత్సవం రోజున సిబ్బందిని సత్కరిస్తాయి. ఫిలాటెలిక్ ప్రదర్శనలు, కొత్త స్టాంప్ విడుదల చేస్తారు.
Also Read : వాట్సాప్ కు దూరంగా ఉండండి – డ్యూరోవ్