Nirmala Sitharaman : ప్రపంచం తిరోగమనం భారత్ పురోగమనం
ఆర్థిక వ్యవస్థలో మనం స్థిరంగా ఉన్నాం
Nirmala Sitharaman : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక పరంగా ఎదురు గాలులు వీస్తున్నా భారత దేశం మాత్రం దానిని ఎదుర్కొని పురోగమనం దిశగా సాగుతోందని చెప్పారు. వాషింగ్టన్ లో జరిగిన అంతర్జాతీయ ద్రవ్య ఆర్థిక సంఘం (ఐఎంఎఫ్‌సీ) ప్లీనరీ సెషన్ లో నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆర్థిక వ్యవస్థ కొంత ఆందోళనకరంగా ఉన్నప్పటికీ భారత్ దానిని సరైన దిశలో ఎదుర్కొనేందుకు ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు. స్థిరమైన నాయకత్వం, ప్రభుత్వం ఉండడం తమకు ప్రధాన బలమని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది.
భారత్ ను కూడా వదిలి పెట్టలేదు. కానీ అన్ని దేశాల కంటే భారత్ మరింత ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకుందని ఆ మేరకు మహమ్మారి దాడి నుంచి బయట పడడం జరిగిందన్నారు. ఇవాళ ఉక్రెయిన్, రష్యా యుద్దం కూడా కొంత మేర వరల్డ్ ఎకానమీని ఇబ్బందులకు గురి చేస్తోందని అభిప్రాయపడ్డారు నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) .
ఇదిలా ఉండగా డిజిటల్ ఎకానమీ వైపు భారత్ పరుగులు తీస్తోందని చెప్పారు. ఇందులో భాగంగా డిజిటల్ చెల్లింపుల ఆవిష్కరణల విషయంలో ఇండియా ప్రపంచంలోనే టాప్ లో ఉందని స్పష్టం చేశారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 7 శాతం వృద్ది చెందుతోందని అంచనా వేయడం జరిగిందన్నారు.
ద్రవ్యోల్బణం నిర్వహణను అనుసరిస్తూనే వృద్దిని కాపాడేందుకు భారత ప్రభుత్వం చొరవ చూపిందని వెల్లడించారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.
Also Read : హంగర్ ఇండెక్స్ లో దిగజారిన భారత్