Yanamala Ramakrishnudu : జగన్ ది పైశాచిక ఆనందం
మాజీ మంత్రి యనమల రామకృష్ణడు
Yanamala Ramakrishnudu : మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు నిప్పులు చెరిగారు. ఆయన ఏపీ సీఎంను ఏకి పారేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆధారాలు లేని స్కాముల పేరుతో జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆరోపించారు. అర్ధాంతరంగా అరెస్ట్ చేసి , కోర్టుల ముందు అబద్దాలు పెట్టి చంద్రబాబు నాయుడును నిర్బంధాన్ని కొనసాగిస్తున్నారంటూ మండిపడ్డారు యనమల రామకృష్ణుడు(Yanamala Ramakrishnudu).
Yanamala Ramakrishnudu Comments on YS Jagan
రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సమస్యలతో హాహాకారాలతో చేస్తుంటే ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తోందంటూ ధ్వజమెత్తారు. అన్ని రంగాలు నేల మట్టం అయ్యాయి. వ్యవసాయ రంగం సంక్షోభంలో నెలకొందన్నారు. రైతుల ఆత్మహత్యలు ఎన్నడూ లేనంతగా పెరిగాయని పేర్కొన్నారు.
ఆకాశాన్నంటిన నిత్యావసరాల ధరలు, పన్నులు భారంగా మారాయని, యువతను చుట్టు ముట్టిన నిరుద్యోగం, ఎయిడెడ్ విద్యా సంస్థల మూసి వేశారని ఆవేదన చెందిరు. ఇవే కాకుండా ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీ సబ్ కాంపోనెంట్ నిధుల మళ్లింపు , విద్యుత్ ఛార్జీల పెంపు, తీవ్ర ఆర్థిక సంక్షోభం వంటి అంశాలన్నంటిపై సమగ్ర చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు.
ఏపీ స్కిల్ స్కాంలో ఎలాంటి అవినీతి , అక్రమాలు చోటు చేసుకోలేదన్నారు యనమల రామకృష్ణుడు. ఏపీ సీఐడీ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఇతర ఆఫీసర్లు కూడా సంతకాలు చేశారని గుర్తు చేశారు.
Also Read : K Atchennaidu : బాబు అంటే జగన్ కు భయం