Yarlagadda Venkata Rao : గన్నవరంలో ఉంటా తేల్చుకుంటా
ఎమ్మెల్యేను టార్గెట్ చేసిన యార్లగడ్డ
Yarlagadda Venkata Rao : కృష్ణా జిల్లా గన్నవరంలో వైసీపీలో రాజకీయం మరింత వేడెక్కింది. ప్రస్తుతం టీడీపీ నుంచి గెలిచి వైసీపీలో చేరిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై వైసీపీ సీనియర్ నాయకుడు యార్లగడ్డ వెంకట్రావు నిప్పులు చెరిగారు. ఆత్మీయ సమ్మేళనం పేరుతో సమావేశం నిర్వహించారు. గన్నవరంలోని ఎస్ఎం కన్వెన్షన్ హాలులో ఈ కార్యక్రమం జరిగింది. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ కోసం పని చేసిన కార్యకర్తలు, నేతలు పాల్గొన్నారు. చాలా మంది ఇక్కడికి రావాలని అనుకున్నారు. కానీ కొందరు కావాలని అడ్డుకున్నారంటూ ఆరోపించారు వెంకట్రావు.
Yarlagadda Venkata Rao Comments
వైసీపీ నేతలు, కార్యకర్తలపై కేసులు పెట్టించారంటూ సంచలన ఆరోపణలు చేశారు. తాను నియోజకవర్గ కార్యకర్తల కోసం సమావేశం ఏర్పాటు చేశానని అన్నారు. 2019లో రాజకీయాల్లో మక్కువతో అమెరికా నుండి ఇక్కడికి వచ్చానని అన్నారు. గన్నవరంలో పార్టీ పరిస్థితి దారుణంగా ఉందన్నారు. తనను జగన్ వెళ్లమని చెప్పడంతో ఫోకస్ పెట్టానని చెప్పారు యార్లగడ్డ వెంకట్రావు(Yarlagadda Venkata Rao).2017 వరకు గన్నవరం ఎయిర్ పోర్టు తప్ప ఎవరూ తనకు తెలియదన్నారు.
కానీ 2019 ఎన్నికల తర్వాత పెద్ద కుటుంబాన్ని జగన్ రెడ్డి ఇచ్చారని చెప్పారు. 270 ఓట్ల తేడాతో తాను ఓడి పోయానని అన్నారు. ఎమ్మెల్యే వంశీతో కలిసి పని చేయమని సీఎం చెప్పిన మాట వాస్తవమేనని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు, నామినేటెడ్ పదవుల్లో నిజమైన వైసీపీ నాయకులకు అన్యాయం జరిగిందని ఆవేదన చెందారు యార్లగడ్డ వెంకట్రావు.
Also Read : TSRTC Offer : టీఎస్ఆర్టీసీ ఇండిపెండెన్స్ డే ఆఫర్