Yashwant Sinha : రాష్ట్రపతి పదవి రేసులో యశ్వంత్ సిన్హా
సూచించిన టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ
Yashwant Sinha : భారత దేశ అత్యున్నత పదవిగా భావించే రాష్ట్రపతి పదవికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పటికే అధికారంలో ఉన్న బీజేపీ సంకీర్ణ సర్కార్ కూల్ గా తన పని తాను చేసుకుంటూ పోతోంది.
అయితే ఈ ఎన్నికల్లో గెలుపొందేందుకు కావాల్సిన మెజారిటీ ఎన్డీయే సర్కార్ కు లేదు. ఇంకా 8, 500 కోట్లు కావాల్సి ఉంటుంది. ఇప్పటికే కీలకంగా ఉన్న టీఆర్ఎస్, వైఎస్సార్సీపీ తటస్థ వైఖరి అనుసరిస్తున్నాయి.
ఈ తరుణంలో విపక్ష పార్టీలకే ఎక్కువ ఓట్లు ఉన్నప్పటికీ ఆయా పార్టీల మధ్య సమన్వయం కొరవడడం కీలకంగా మారింది. బీజేపీకి, మోదీ పరివారానికి వ్యతిరేకంగా కూటమిని ఏర్పాటు చేసే పనిలో గత కొంత కాలంగా ప్రయత్నం చేస్తూ వచ్చింది.
ఇందులో భాగంగా ఈనెల 15న 22 పార్టీలకు సంబంధించి సమావేశం నిర్వహించింది. కానీ 17 పార్టీలు మాత్రమే హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా హాజరయ్యారు. టీఆర్ఎస్, వైసీపీ, ఎంఐఎం పార్టీల నేతలు దూరంగా ఉన్నారు.
ఢిల్లీలో జరిగిన కీలక సమావేశంలో మొదటగా ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ పేరును రాష్ట్రపతి పదవికి ప్రతిపాదించారు దీదీ. మమతా బెనర్జీ చేసిన ప్రతిపాదనకు మిగతా పార్టీల నేతలు ఓకే చెప్పాయి.
కానీ పవార్ ఒప్పు కోలేదు. దీంతో జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా తో పాటు మహాత్మా గాంధీ మనుమడు, మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ పేర్లను ప్రతిపాదించారు.
తీరా ఆ ఇద్దరూ తాము రాష్ట్రపతి పదవిపై పోటీ చేసేందుకు సిద్దంగా లేమని ప్రకటించారు. ఇప్పటికే ముగ్గురు పేర్లు ప్రతిపాదనకు రాగా ఆ ముగ్గురూ తప్పుకున్నారు.
తాజాగా మరో పేరు నాలుగో వ్యక్తి తెరపైకి వచ్చారు. ఆయనే గతంలో బీజేపీలో ఉంటూ ఇటీవల టీఎంసీలో చేరిన యశ్వంత్ సిన్హా(Yashwant Sinha). ఇంతకంటే అదృష్టం తనకు రాదన్నారు సిన్హా.
Also Read : బీజేపీ ఆటలు సాగవు సర్కార్ కూలదు