Yashwant Sinha : మోదీ..రాజ్ నాథ్ కు సిన్హా ఫోన్
కేంద్ర రక్షణ శాఖ మంత్రికి రాజ్ నాథ్ కు ఫోన్
Yashwant Sinha : ఉమ్మడి ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన మాజీ కేంద్ర మంత్రి, మాజీ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, టీఎంసీ ఉపాధ్యక్షుడు యశ్వంత్ సిన్హా(Yashwant Sinha) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు ఫోన్ చేశారు.
తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా ఆయన కోరారు తాను ఎన్నికైతే భారత రాజ్యాంగం ప్రాథమిక విలువలు, మార్గదర్శక ఆదర్శాలను నిర్భయం లేదా అనుకూలత లేకుంఆ మనస్సాక్షిగా కట్టుబడి ఉంటానని ఈ సందర్భంగా తెలిపారు.
అంతే కాకుండా యశ్వంత్ సిన్హా జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ కు కూడా ఫోన్ చేశారు. జార్ఖండ్ ముక్తి మోర్చా తనకు బేషరత్తుగా మద్దతు ఇస్తుందని భావిస్తున్నట్లు స్పష్టం చేశారు.
తాము ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాం. ఎన్నికల్లో ప్రతి ఒక్కరి మద్దతును కోరుతామని యశ్వంత్ సిన్హా(Yashwant Sinha) కు మద్దతు ఇస్తున్న ఎన్సీపీ తెలిపింది. సిన్హా పీఎంకు, రాజ్ నాథ్ సింగ్ , సీఎం సోరేన్ కు ఫోన్ చేసిన విషయాన్ని వెల్లడించింది.
ఇదే సమయంలో యశ్వంత్ సిన్హా తన దూకుడు మరింత పెంచారు. తన రాజకీయ గురువుగా భావించే, బీజేపీ సీనియర్ నాయకుడు లాల్ కృష్ణ అద్వానీ ని కూడా సంప్రదించారు.
ఇదిలా ఉండగా ఈనెల 27న సోమవారం ఉమ్మడి ప్రతిపాక్షల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. వచ్చే జూలై 18న రాష్ట్రపతి పదవికి పోలింగ్ జరుగుతుంది. 21న ఫలితాన్ని డిక్లేర్ చేస్తారు.
Also Read : నిధుల దుర్వినియోగంపై శ్వేతపత్రం – సీఎం