Yashwant Sinha : కేంద్ర స‌ర్కార్ పై య‌శ్వంత్ సిన్హా ఫైర్

క‌రోనా పేషెంట్ ను ఈడీ ఎలా విచారిస్తుంది

Yashwant Sinha : నేష‌న‌ల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి ఏఐసీసీ తాత్కాలిక చీఫ్ సోనియ గాంధీని కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఈడీ విచార‌ణ జ‌ర‌పడాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు విప‌క్షాల ఉమ్మ‌డి రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా పోటీ చేసిన , కేంద్ర మాజీ మంత్రి య‌శ్వంత్ సిన్హా(Yashwant Sinha).

ఇది పూర్తిగా విరుద్ద‌మ‌ని పేర్కొన్నారు. క‌రోనా సోకి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న త‌రుణంలో ఎలా విచార‌ణ‌కు పిలుస్తారంటూ ప్ర‌శ్నించారు. అస‌లు ఈ దేశంలో ప్ర‌భుత్వం అనేద ఉందా అని నిల‌దీశారు.

దీనికంతటికీ కార‌ణం కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వ నిర్వాక‌మేన‌ని సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. గురువారం య‌శ్వంత్ సిన్హా స్పందించారు. ఈ మేర‌కు ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

ఢిల్లీలోని ఈడీ కార్యాల‌యంలో సోనియా గాంధీని రెండు గంట‌ల పాటు ప్ర‌శ్నించింది ఈడీ. ఇదే స‌మ‌యంలో దేశ వ్యాప్తంగా ఆమెకు సంఘీభావంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో ఆందోళ‌న‌లు చేప‌ట్టింది.

1995 నాటి హ‌వాలా కేసులో కూడా సెంట్ర‌ల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్ (సీబీఐ) ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న వారి ఇళ్ల‌కు కూడా వెళ్లింద‌ని సిన్హా గుర్తు చేశారు ఈ సంద‌ర్భంగా. ఈడీ కేంద్ర ప్ర‌భుత్వ ఒత్తిళ్ల‌కు తలొగ్గి ప‌ని చేస్తోందంటూ ఆరోపించారు.

ఒక వేళ విచార‌ణ జ‌ర‌పాల‌ని అనుకుంటే ఆమె ఇంటి వ‌ద్ద‌కు వెళ్లి విచారించి ఉండాల్సి ఉంద‌ని పేర్కొన్నారు. ఇది పూర్తిగా ప్ర‌జాస్వామ్యానికి చేటుగా ఆయ‌న అభివ‌ర్ణించారు.

ఇలాంటి ప‌ద్ద‌త‌లు మంచిది కాద‌ని పేర్కొన్నారు. ఎంత ఈడీ అయినంత మాత్రాన ఇలా వ్య‌వ‌హ‌రించ‌డం స‌రికాద‌ని సూచించారు.

Also Read : 25న హాజ‌రు కావాల‌ని సోనియాకు స‌మ‌న్లు

Leave A Reply

Your Email Id will not be published!