Congress Rss : ఆర్ఎస్ఎస్ కామెంట్స్ పై యాత్ర ఎఫెక్ట్

దేశంలో నిరుద్యోగం..పేద‌రికంపై నేత‌లు

Congress Rss : కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర ప్ర‌భావం వ‌ల్ల‌నే రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ నాయ‌కులు దేశంలో పేద‌రికం, నిరుద్యోగం పెరుగుద‌ల ఆందోళ‌న క‌లిగిస్తోందంటూ పేర్కొన్నార‌ని ఎద్దేవా చేసింది.

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వత్, పార్టీ సిద్దాంత‌క‌ర్త‌గా భావించే ద‌త్తాత్రేయ హోస‌బాలే లు ఈ రెండింటిపై ఎక్కువ‌గా ప్ర‌స్తావించారు. ఇది దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం క‌లిగించింది.

ప్ర‌ధానంగా 23 శాతానికి పైగా కేవ‌లం రోజుకు 240 రూపాయ‌లు కూడా పేద వాడికి అంద‌డం లేద‌ని హోస‌బాలే పేర్కొన‌డం నేడు మోదీ పాల‌న‌కు అద్దం ప‌డుతోందంటూ పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు , మాజీ సీఎం దిగ్విజ‌య్ సింగ్. ప్ర‌ధానంగా ఆర్ఎస్ఎస్ పై తీవ్రంగా మండిప‌డ్డారు.

ఇప్ప‌టికైనా ఆర్ఎస్ఎస్ నాయ‌కుల‌కు అవ‌గాహ‌న వ‌చ్చినందుకు ఆనందంగా ఉంద‌న్నారు. తాము మొద‌టి నుంచీ చెబుతూనే వ‌చ్చామ‌ని కానీ బీజేపీ గుడ్డిగా అడ్డుకుంటూ వ‌చ్చింద‌న్నారు. ప్ర‌చారం త‌ప్ప ఎలాంటి ప‌నులు చేసిన దాఖ‌లాలు మోదీ ఇలాఖాలో లేవ‌న్నారు.

ఇదంతా రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర వ‌ల్ల ఆర్ఎస్ఎస్(Congress Rss) నేత‌లు అలా కామెంట్స్ చేశార‌ని పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ మీడియా ఇన్ చార్జి జై రాం ర‌మేష్ .

మంగ‌ళ‌వారం ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసే వారు. స‌మాజంలో విషం చిమ్మే వారు కూడా పేద‌రికం, నిరుద్యోగం, అస‌మాన‌త‌ల‌ను గురించి మాట్లాడ‌టం విడ్డూరంగా ఉంద‌న్నారు.

ద‌త్తాత్రేయ అవ‌గాహ‌న లేకుండా మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు కాంగ్రెస్ నేత‌లు.

Also Read : శ‌శి థ‌రూర్ కు గ్రాండ్ వెల్ క‌మ్

Leave A Reply

Your Email Id will not be published!