BS Yediyurappa : కర్ణాటకలో త్వరలో ఎన్నికలు జరగ బోతున్నాయి. ఈ తరుణంలో సీఎంను మార్చుతారంటూ పెద్ద ఎత్తున జోరుగా ప్రచారం జరిగింది. దీనిపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు మాజీ సీఎం, బీజేపీ అగ్ర నాయకుడు బీఎస్ యెడియూరప్ప(BS Yediyurappa).
ప్రస్తుతం సీఎం బసవరాజ్ బొమ్మై అద్బుతంగా పని చేస్తున్నారంటూ కితాబు ఇచ్చారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. ప్రతి రాష్ట్రంలో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా కొన్ని సమస్యలు వస్తూనే ఉంటాయన్నారు.
ప్రతి చిన్న దానిని భూతద్దంలో చూడొద్దని హితవు పలికారు. సీఎం మార్పు పై పూర్తి క్లారిటీ ఇచ్చారు యెడియూరప్ప. ఎలాంటి మార్పు ఉండబోదన్నారు.
నాయకత్వ మార్పు ఉంటుందని వస్తున్న ప్రచారం నమ్మ వద్దన్నారు. ఇదిలా ఉండగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా కర్ణాటకలో పర్యటిస్తున్నారు.
ఈ తరుణంలో నాయకత్వ మార్పు తప్పదని ప్రచారం ఊపందుకుంది. ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారడంతో మాజీ సీఎం స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈనెల 3న రాష్ట్రంలో జరిగే పలు కార్యక్రమాలలో అమిత్ షా పాల్గొంటారు. ఖేలో ఇండియా యూనివర్శిటీ ఆటల ముగింపు వేడుకల్లో పాల్గొంటారు. బసవేశ్వరుడి జయంతి సందర్భంగా 12వ శతాబ్ధానికి చెందిన సంఘ సంస్కర్త బసవేశ్వరుడికి నివాళులు అర్పిస్తారు.
ఆ తర్వాత పార్టీ ముఖ్యులతో సమావేశం కానున్నారు. వచ్చే ఎన్నికల్లో 150 సీట్లు సాధించేందుకు అవసరమైన సలహాలు , సూచనలు ఇవ్వనున్నారు.
మొత్తంగా మార్పు మాత్రం ఉంటుందని ప్రచారం జరగడం విశేషం. దీనిని నమ్మ వద్దని యెడ్డీ (BS Yediyurappa)కోరడం విశేషం.
Also Read : వ్యాక్సిన్ తీసుకోవాలని బలవంతం చేయలేం