#YediyurappaCabinet : యడియ్యూరప్ప కేబినెట్ విస్తరణపై అసంతృప్తి
ముచ్చటగా మూడోసారి కేబినెట్ విస్తరణ
Yediyurappa Cabinet : ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన కమలనాథులకు కర్ణాటక సీఎం యడియ్యూరప్ప సంక్రాంతి పండుగ వేళ ఆనందాన్ని ఇచ్చేలా చేశారు. మంత్రివర్గ విస్తరణ ఎట్టకేలకు పూర్తయింది. అయితే ఎడ్డీ కేబినెట్‌లో చోటు దక్కుతుందని ఆశించిన పలువురు ఎమ్మెల్యేలు అసమ్మతి రాగం స్టార్ట్ చేశారు. ఏకంగా పార్టీ హైకమాండ్ కు యడ్డీపై ఆరోపణలకు దిగారు. ఇదిలా ఉండగా అసమ్మతి నేతల ఎత్తులు, నాయకత్వ మార్పు జరుగుతుందంటూ గత కొన్ని నెలలగా విస్తృతంగా ప్రచారం జరిగింది కర్నాటకలో. కేబినెట్ క్లియర్ కావడంతో ఊహాగానాలకు తెర పడింది. తాజాగా నలుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలకు కేబినెట్ లో చోటు కల్పించారు సీఎం యడియ్యూరప్ప.
కేబినెట్ విస్తరణలో హక్కేరికి చెందిన ఉమేష్ కట్టి, సల్లియాకు చెందిన ఎస్. అంగర, బిల్గీకి చెందిన మురుగేష్ నిరాని, మహదేవపురకు చెందిన అరవింద్ లింబావలీ ఉండగా ఎమ్మెల్సీలు ఆర్. శంకర్, ఎంబీటీ నాగరాజ్, సీపీ యోగేశ్వర్ లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య 2019 జూలైలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సీనియర్ నాయకుడు మోదీకి దగ్గరగా ఉన్న యడియ్యూరప్పకే మళ్లీ సీఎం పగ్గాలు అప్పగించారు. అప్పట్లో 17 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ సర్కార్ కుప్ప కూలింది.
దీంతో బీజేపీకి అనూహ్యంగా అవకాశం ఏర్పడింది. అయితే యడ్డీ నాయకత్వంపై బీజేపీకి చెందిన చాలా మంది ప్రజాప్రతినిధులు తీవ్ర అసంతృప్తితో రగిలి పోతున్నారు. ఇప్పటికే 2019లో 2020 ఫిబ్రవరిలో మరోసారి కేబినెట్ ను విస్తరించారు. అయినా కమలంలో లుకలుకలు తగ్గలేదు. ఉన్నట్టుండి యడ్డీ ఢిల్లీకి వెళ్లారు. ఆపై ఆయనే సీఎంగా ఉంటారని హై కమాండ్ తేల్చసింది. రానున్న రోజుల్లో ఎలా నెట్టుకు వస్తారో తేలాల్సి ఉంది. కాగా అసంతృప్తులను ఎలా దారిలోకి తెచ్చుకుంటారనే దానిపై మల్లగుల్లాలు పడుతోంది పార్టీ.
No comment allowed please