Bjp Parliamentary Board : గడ్కరీ..చౌహాన్ ఔట్ యెడ్డీకి చాన్స్
బీజేపీ పార్లమెంటరీ బోర్డులో కీలక మార్పులు
Bjp Parliamentary Board : భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ బోర్డు(Bjp Parliamentary Board) లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అనూహ్యంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో పాటు మధ్య ప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ లకు కోలుకోలేని షాక్ తగిలింది.
వారిద్దీరినీ తొలగించారు. అనూహ్యంగా కర్నాటక మాజీ సీఎం, దక్షిణాదిన మోస్ట్ పవర్ ఫుల్ బీజేపీ నాయకుడిగా పేరొందిన బీఎస్ యెడియూరప్పతో సోనావాల్ కు చోటు దక్కింది బోర్డులో.
భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా బుధవారం పార్టీ పార్లమెంటరీ బోర్డును పునరుద్దరించారు. కేంద్ర మంత్రి సర్వానంద సోనోవాల్ , యెడ్డీని బీజేపీ అత్యున్నత నిర్ణయాధికార సంస్థలోకి చేర్చారు.
టాప్ లో ఉన్న గడ్కరీ, చౌహాన్ లకు ఊహించని షాక్ తగిలింది. పార్లమెంటరీ బోర్డులో ఐదు ఖాళీలు ఉన్నాయి. ఇది పార్టీ కి చెందిన శాసనసభ, పార్లమెంటరీ విభాగాల కార్యకలాపాలను పర్యవేక్షించడంతో పాటు నియంత్రించే అధికారం, మంత్రిత్వ శాఖల ఏర్పాటుకు మార్గ నిర్దేశనం చేస్తుంది.
ఇక తాజాగా పునరుద్దరించిన 11 మంది సభ్యుల బోర్డులో ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ చంద్ర షా, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ , ఓబీసీ మోర్చా చీఫ్ కె. లక్ష్మణ్ , జాతీయ మైనార్టీ కమిషన్ చైర్మన్ ఇక్బాల్ సింగ్ లాల్ పురా, మాజీ బీజేపీ ఉపాధ్యక్షురాలు సుధా యాదవ్ , మాజీ మంత్రి సత్య నారయణ్ ఉన్నారు.
దీంతో పాటు పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీని కూడా పునరుద్దరించారు. 15 మంది సభ్యుల బోర్డులో ప్రధాని మోదీ, జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ , సోనోవాల్ , బీఎస్ యెడియూరప్ప, కె. లక్ష్మణ్ , లాల్ పురా, సుధా యాదవ్ , ఓం మాథుర్ , బీఎల సంతోష్ , సత్య నారాయణ జాతియా, భూపేంద్ర యాదవ్ , దేవేంద్ర ఫడ్నవీస్ , వనతీ శ్రీనివాసన్ ఉన్నారు.
Also Read : దేశ వ్యతిరేకులకు కాంగ్రెస్ మద్దతు
