Yenugu Ravinder Reddy : బీజేపీకి షాక్ ఏనుగు జంప్
కాంగ్రెస్ పార్టీలో చేరిన రవీందర్ రెడ్డి
Yenugu Ravinder Reddy : న్యూఢిల్లీ – భారతీయ జనతా పార్టీకి కోలుకోలేని షాక్ తగిలింది. సీనియర్ నాయకులు , మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు సీనియర్ నేత ఏనుగు రవీందర్ రెడ్డి కాషాయ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ ఇద్దరు నేతలు తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ , పార్టీ సీనియర్ నేత మాణిక్ రావు ఠాక్రే సమక్షంలో ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాయలంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
Yenugu Ravinder Reddy Resigned from BRS
ఏనుగు రవీందర్ రెడ్డి గతంలో బీఆర్ఎస్(BRS) లో ఉన్నారు. ఆయన మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అనుచరుడిగా పేరు పొందారు. ఉన్నట్టుండి తనను పట్టించు కోవడం లేదంటూ రాజేందర్ పై , బీజేపీపై ఆరోపణలు చేశారు.
ఊహించని రీతిలో రాజ గోపాల్ రెడ్డి, రవీందర్ రెడ్డి జంప్ అయ్యారు. దీంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మునుగోడు బరిలో నిలిచారు కోమటిరెడ్డి. ఊహించని రీతిలో ప్రభాకర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. కానీ గులాబీ అభ్యర్థి గెలుపొందారు.
రాష్ట్రంలో త్వరలో జరగబోయే శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని జోష్యం చెప్పారు ఏనుగు రవీందర్ రెడ్డి. ఈ చేరిక కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి, మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు.
Also Read : Komatireddy Raj Gopal Reddy : ఛాన్స్ ఇస్తే కేసీఆర్ పై పోటీ చేస్తా