Yerrasekhar : జడ్చర్ల – మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. బరా బర్ బరిలో ఉంటానని ప్రకటించారు. తనకు జడ్చర్ల లేదా నారాయణ్ పేటలో సీటు వస్తుందని ఆశించారు. కానీ అనుకోని రీతిలో కాంగ్రెస్ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ మొండి చేయి చూపింది.
Yerrasekhar Comments Viral
దీంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. ఆయన రేవంత్ వర్గంగా ముద్ర పడ్డారు. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తన అనుచరుడిగా పేరు పొందిన అనిరుధ్ రెడ్డికి టికెట్ ఇప్పించు కోవడంలో సక్సెస్ అయ్యాడు.
రెండో జాబితాలో తనకు కాకుండా అనిరుధ్ రెడ్డికి టికెట్ కేటాయించడంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఎర్రశేఖర్(Yerrasekhar). తన అనుచరులు, పార్టీకి చెందిన నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా సంచలన ప్రకటన చేశారు. తాను ఎక్కడికీ వెళ్లనని, ఇక్కడే ఉంటానని , జడ్చర్లలోనే పోటీ చేస్తానంటూ స్పష్టం చేశారు.
ఈ మేరకు నవంబర్ 9న తాను నామినేషన్ వేయనున్నట్లు వెల్లడించారు. జడ్చర్ల నియోకవర్గ ప్రజలు తనను ఆశీర్వదించాలని ఎర్రశేఖర్ కోరారు.
Also Read : CM KCR Comment : సీఎం నైరాశ్యం కలకలం