YES Bank DHFL Scam : రూ. 415 కోల్ల‌ బిల్డ‌ర్ల‌ ఆస్తులు స్వాధీనం

దేశంలోనే అతి పెద్ద బ్యాంకు స్కాం

YES Bank DHFL Scam : భార‌త దేశంలో అతి పెద్ద బ్యాంక్ మోసంలో రూ. 415 కోట్ల విలువైన ఇద్ద‌రు బిల్డ‌ర్ల ఆస్తులు స్వాధీనం చేసుకుంది కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌.

ఆయా బ్యాంకుల‌కు రూ. 34,000 కోట్ల‌కు పైగా న‌ష్టం క‌లిగించిన యెస్ బ్యాంక్ – డీహెచ్ఎఫ్ఎల్(YES Bank DHFL Scam) కేసులో సంజ‌చ్ ఛబ్రియా, అవినాష్ భోస‌లే గ‌తంలో అరెస్ట్ అయ్యారు.

మ‌నీ లాండ‌రింగ్ , మోసానికి పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న మ‌హారాష్ట్ర‌కు చెందిన బిల్డ‌ర్ ఆస్తి నుండి అగ‌స్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్ట‌ర్ ను స్వాధీనం చేసుకున్నారు.

కొద్ది రోజుల త‌ర్వాత ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ బుధ‌వారం అత‌డి నుండి రూ. 415 కోట్ల విలువైన ఆస్తుల‌తో పాటు అతి పెద్ద బ్యాంకుల‌లో నిందితుడిగా ఉన్న మ‌రో బిల్డ‌ర్ ను అటాచ్ చేసింది.

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వం లోని 17 బ్యాంకుల క‌న్సార్టియానికి 34 వేల కోట్ల కు పైగా న‌ష్టం క‌లిగించిన యెస్ బ్యాంక్ – దీవాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ కేసులో రేడియ‌స్ డెవ‌ల‌ప‌ర్ల‌కు చెందిన సంజ‌య్ ఛ‌బ్రియా , ఐబీఐఎల్ ఇన్ ఫ్రాస్ట్రక్చ‌ర్ కు చెందిన అవినాష్ భోసాలే గ‌తంలో అరెస్ట్ అయ్యారు.

కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ సీబీఐ గ‌త వారం పూణే ల‌ని అవినాష్ భోస‌లే వ‌ద్ద హెలికాప్ట‌ర్ ను క‌నుగొన్నారు. ఇవాళ ముంబై లోని శాంతాక్ఊజ్ లోని రూ. 116. 5 కోట్ల విలువైన ల్యాండ్ పార్సిల్ , రూ. 115 కోట్ల విలువైన బెంగ‌ళూరులో ఉన్న ల్యాండ్ పార్సిల్ లో ఉన్న ఛ‌బ్రియా కంపెనీకి చెందిన 25 శాతం ఈక్విటీ షేర్లు, రూ. 3 కోట్ల విలువైన శాంతా క్రూజ్ లోని మ‌రో ప్లాట్ , రూ. 3.10 కోట్ల విలువ చేసే సంజ‌య్ ఛ‌బ్రియాకు చెందిన మూడు అత్యాధునిక ల‌గ్జ‌రీ కార్ల‌ను స్వాధీనం చేసుకున్న‌ట్లు సీబీఐ వెల్ల‌డించింది.

ఇక అవినాష్ భోస‌లే కు చెందిన ముంబై లో రూ. 102.8 కోట్ల విలువైన డ్య్యూప్లెక్స్ ప్లాట్ రూపంలో , పూణేలో రూ. 14.65 కోట్ల విలువైన ల్యాండ్ పార్సిల్ , రూ. 29.24 కోట్ల విలువైన పూణే లోని మ‌రో ల్యాండ్ పార్సిల్ , రూ. 15.52 కోట్ల విలువైన నాగ్ పూర్ లోని ల్యాండ్ పార్సిల్ , మ‌రో రూ. 1.45 కోట్ల విలువైన భూమిలో మ‌రో భాగాన్ని అటాచ్ చేసిన‌ట్లు సీబీఐ స్ప‌ష్టం చేసింది.

Also Read : 16న జ‌న‌గ‌ణ‌మ‌న గీతాలాప‌న – కేసీఆర్

Leave A Reply

Your Email Id will not be published!