Dinesh Khatik : నిన్న అసమ్మతి స్వరం నేడు అధికారపక్షం
నిన్న తిరుగుబాటు నేడు లొంగుబాటు
Dinesh Khatik : యూపీలో రెండో సారి కొలువు తీరిన యోగి ఆదిత్యానాథ్ ఏది చెబితే అదే వేదం. ఆయనపై అసమ్మతి స్వరం వినిపించిన వారంతా అమిత్ షా ను కలిశారు. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ ఉన్నట్టుండి మాట మార్చారు మంత్రి దినేష్ ఖటిక్(Dinesh Khatik).
రాజీనామా చేయమంటూ రాసిన లేఖ సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం యోగిని కలిశారు. అనంతరం తాను యూపీ జల శక్తి మంత్రిగా కొనసాగుతానని చెప్పారు.
తాను రాజీనామా చేయడం లేదంటూ స్పష్టం చేశారు. అన్ని సమస్యలను తన ముందు ఉంచానని , పదవిలో ఉంటానన్నారు. దళితుడైన తనను అధికారులు విస్మరిస్తున్నారని, తన శాఖలో అవినీతి జరిగిందంటూ ఆ లేఖలో పేర్కొన్నారు.
జల్ శక్తి శాఖ సహాయ మంత్రి అయిన ఖటిక్ సీఎం అధికారిక నివాసమైన 5 కాళిదాస్ మార్గ్ లో యోగి ఆదిత్యా నాథ్ ను కలిశారు. నా సమస్యలు ఏమైనప్పటికీ వాటిని సీఎం ముందు ఉంచానని చెప్పారు.
త్వరలోనే చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారని తెలిపారు. సీఎం నివాసం నుండి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడారు. అవినీతి పట్ల జీరో టాలరెన్స్ పాలసీని కలిగి ఉన్న సీఎం నాయకత్వంలో ప్రభుత్వం నడుస్తోందన్నారు ఖటిక్(Dinesh Khatik).
యోగి ఆదిత్యానాథ్ పని చేస్తూనే ఉంటారు. నేను కూడా పని చేస్తూనే ఉంటానని చెప్పారు. ఈ సమావేశంలో కేబినెట్ మంత్రి స్వతంత్ర దేవ్ సింగ్ కూడా ఉన్నారు.
అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై మంత్రి జితిన్ ప్రసాద ఓఎస్డీ సహా ఐదుగురు పీడబ్ల్యూడీ అధికారులను సీఎం ఆదిత్యా నాథ్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం ప్రభుత్వాన్ని మరింత ఇరకాటంలో పడేసింది.
Also Read : ఆకాసా ఎయిర్ లైన్స్ బుకింగ్ షురూ