Yogendra Yadav : మార్పు తథ్యం హస్తం వైపు జనం
యోగేంద్ర యాదవ్ షాకింగ్ కామెంట్స్
Yogendra Yadav : న్యూఢిల్లీ – ప్రముఖ సామాజికవేత్త , మేధావి , ప్రజాస్వామిక వాది యోగేంద్ర యాదవ్(Yogendra Yadav) కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. తాను తెలంగాణలో పర్యటించిన సందర్బంగా ఆసక్తికరమైన సన్నివేశాలు తన దృష్టికి వచ్చాయని తెలిపారు. ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇది పూర్తిగా రాష్ట్రంలో పాలన సాగిస్తున్న ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు యోగేంద్ర యాదవ్.
Yogendra Yadav Comments Viral
ప్రధాన వ్యవస్థలన్నీ నీరు గారి పోయాయని, వాటిని ఉపయోగించు కోకుండా నిర్వీర్యం చేయడం వల్ల ఇవాళ మార్పు రావాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమైందని స్పష్టం చేశారు. ఒక రకంగా చెప్పాలంటే భారత్ జోడో యాత్ర ప్రభావం తెలంగాణపై కూడా పడిందని తేలి పోయిందన్నారు.
ఏ ఆకాంక్షల కోసం తెలంగాణను తెచ్చుకున్నారో వాటి నుండి బీఆర్ఎస్ సర్కార్ వేరై పోయిందని, అందుకే ఆ పార్టీ ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోందని జోష్యం చెప్పారు. ప్రస్తుతం బీజేపీని, బీఆర్ఎస్ , ఎంఐఎం ఒక్కటేనన్న అభిప్రాయం కూడా ఉందని ఇది ఈ మూడు పార్టీలకు మైనస్ కానుందని పేర్కొన్నారు. మొత్తంగా యోగేంద్ర యాదవ్ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
Also Read : Komatireddy Venkat Reddy : కేసీఆర్ కుటుంబం ఇక జైలుకే