Yogi Adityanath : ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారిగా తన తల్లిని కలుసుకున్నారు యోగి ఆదిత్యానాథ్(Yogi Adityanath). అధికారిక కార్యక్రమం కాకుండా కుటుంబం కోసం పాల్గొనేందుకు ఉత్తరాఖండ్ కు తిరిగి రావడం 28 ఏళ్లలో ఇదే తొలిసారి.
యోగి ఆదిత్యానాథ్ తల్లి సావిత్రి దేవి. ఆమెకు ఇప్పుడు 85 ఏళ్లు. ఇవాళ చాలా ఆనందంగా ఉంది. అంతకంటే సంతోషంగా ఉంది. గుండె పొంగుతోంది. నాకు జన్మను ప్రసాదించిన నా తల్లిని నేను దర్శించుకున్నాను.
ఆమె పవిత్రమైన పాదాలను తాకాను. నన్ను ఆశీర్వదించింది. ఈ సందర్భంగా ఇవాళ నా జన్మ ధన్యమైందని పేర్కొన్నారు యోగి ఆదిత్యానాథ్. తన తల్లి సావిత్రా దేవితో ఆశీర్వాదం తీసుకుంటున్న ఫోటోలను షేర్ చేశారు స్వయంగా సీఎం.
ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఇదిలా ఉండగా సావిత్రా దేవికి యోగి ఆదిత్యా నాథ్ తో పాటు మరో ఆరుగురు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్ లోని తన స్వస్థలమైన పౌరీలో ఉన్న తల్లితో కలిశారు.
బుధవారం తన మేనల్లుడి కేశ ఖండన వేడుకల కోసం సీఎం యోగి ఆదిత్యా నాథ్ తన పూర్వీకుల గ్రామాన్ని సందర్శించారు. కరోనా కారణంగా యూపీ సీఎం 2020 ఏప్రిల్ లో హరిద్వార్ లో జరిగిన తన తండ్రి అంత్యక్రియలకు కూడా హాజరు కాలేదు.
దీనిని పురస్కరించుకుని యోగి ఆదిత్యానాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చివరి క్షణంలో మా నాన్నగారి దర్శనం పొందాలని కోరిక ఉండేది. రాష్ట్రంలోని 23 కోట్ల మంది ప్రజల పట్ల నేను బాధ్యత కలిగిన పదవిలో ఉన్నాను. అలా చేయలేక పోయానని తెలిపారు.
Also Read : ప్రతిపక్షాలపై భగ్గుమన్న సంజయ్ రౌత్