Yogi Adityanath : కాగజ్ నగర్ – కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ సర్కార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం కాగజ్ నగర్ లో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విజయ్ సంకల్ప సభలో ప్రసంగించారు. బీఆర్ఎస్ అంటే అవినీతి బంధువుల సమితి అని ఎద్దేవా చేశారు. ప్రజలు పాలన సాగించమని చెబితే సీఎం ఫామ్ హౌస్ కే పరిమితం కావడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.
Yogi Adityanath Comments on BRS Party
అవినీతి, అక్రమాలకు ఈ రాష్ట్ర సర్కార్ కేరాఫ్ గా మారిందని ఆరోపించారు యోగి ఆదిత్యానాథ్(Yogi Adityanath). ఉమ్మడి ఏపీలో మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ అప్పుల కుప్పగా మార్చిన ఘనుడు కేసీఆర్ అంటూ ధ్వజమెత్తారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో కోరి కొని తెచ్చుకున్న తెలంగాణలో ఇప్పుడు ఆత్మహత్యలు తప్ప మరోటి కనిపించడం లేదంటూ ఆరోపించారు యూపీ సీఎం.
దేశంలో సుస్థిరమైన పాలన కేవలం బీజేపీతోనే సాధ్యమవుతుందన్నారు. తెలంగాణలో బీజేపీ తప్పకుండా గెలుస్తుందన్న నమ్మకం తనకు ఉందన్నారు. కేసీఆర్ ఆధిపత్యాన్ని, అహంకారాన్ని మట్టు బెట్టాలంటే మీరంతా బీజేపీకి ఓట్ల రూపంలో ఛాన్స్ ఇవ్వాలని కోరారు. దేశం మోదీ పాలనలోనే సుభిక్షంగా, సురక్షితంగా ఉందన్నారు యోగి ఆదిత్యానాథ్.
Also Read : D Raja : మోదీ పాలనలో దేశం ఆగమాగం