Yogi Adityanath : ఉత్తర ప్రదేశ్ లో గూండాగిరి, అల్లర్లు, దాడులు ఇక నుంచి చెల్లవు అని ప్రకటించారు సీఎం యోగి ఆదిత్యానాథ్. గుజరాత్, మధ్య ప్రదేశ్ , జార్ఖండ్ , పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో జరిగిన రామ నవమి వేడుకల సందర్భంగా ఘర్షణలు చెలరేగాయి.
ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు పలువురు గాయపడ్డారు. దీనిపై స్పందించారు యోగి ఆదిత్యానాథ్(Yogi Adityanath). గతంలో జరిగిందేమో కానీ ఇక నుంచి రాష్ట్రంలో అల్లర్లకు, అక్రమాలకు, గూండా గిరీకి చోటు లేదని స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఎలాంటి ఉద్రిక్తత లేదన్నారు. యూపీలో కోట్లాది మంది నివసిస్తున్నారు. వారంతా ప్రశాంతంగా ఉన్నారు. ఏ మాత్రం అల్లరు సృష్టించేందుకు ప్రయత్నం చేసినా ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు సీఎం.
ఇదే నెలలో శ్రీరామ నవమితో పాటు రంజాన్ కూడా వస్తుంది. అలాగని రెండింటిని అడ్డం పెట్టుకుని ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేయాలని అనుకుంటే లోపల వేస్తామని వార్నింగ్ ఇచ్చారు యోగి.
ఇక నుంచి అల్లర్లు, గ్యాంగ్ స్టర్లు, నేరగాళ్ల మాట మరిచి పోండి అని పిలుపునిచ్చారు. తాను భరోసా ఇస్తున్నానని ఎవరూ అధైర్య పడాల్సిన పని లేదన్నారు.
ఇదే విషయాన్ని ఆయన తన ట్విట్టర్ లో పేర్కొన్నారు కూడా. యూపీ కొత్త అభివృద్ధికి ఎజెండా అని ఇక పై అల్లరకు, దారుణాలకు, దౌర్జన్యాలకు, మోసాలకు , అక్రమాలకు తావు ఉండదని స్పష్టం చేశారు సీఎం యోగి ఆదిత్యానాథ్(Yogi Adityanath).
ఒక వేళ ఏదైనా చేయాలని ప్రయత్నం చేస్తే బుల్డోజర్లు రెడీగా ఉన్నాయని చెప్పారు సీఎం.
Also Read : మోదీకి ‘లతా దీనానాథ్ మంగేష్కర్’ అవార్డు