Yogi Adityanath : దేశ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు పూర్తయ్యాయి. ఊహించని రీతిలో పంజాబ్ లో ఆప్ జెండా ఎగుర వేసింది. ఇక యోగీ ఆదిత్యానాథ్ (Yogi Adityanath)పాలనకు అగ్ని పరీక్షగా మారిన యూపీ ఎన్నికల్లో సత్తా చాటుకున్నారు.
తానేమిటో ప్రూవ్ చేసుకున్నారు. ఇక నుంచి అవినీతి, అక్రమాల భరతం పడతానంటూ ప్రకటించాడు. ఇక మొత్తం రాష్ట్రంలో 403 సీట్లకు గాను భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 202 సీట్లను దాటేసింది.
కాగా గతంలో 317 సీట్లను తెచ్చుకున్న బీజేపీకి కొన్ని సీట్లు తగ్గాయి. ఈసారి జరిగిన ఎన్నికల్లో మొత్తం 270 సీట్లలో విజయం సాధించి కోలుకోలేని షాక్ ఇచ్చింది.
విచిత్రం ఏమిటంటే సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ గతంలో 7 సీట్లతో ఉంటే ఈసారి 2 సీట్లకే పరిమితం అయ్యింది. ఇక నువ్వా నేనా అన్న రీతిలో పోటీ ఇచ్చిన ఎస్పీ కూటమి 124 సీట్లకే పరిమితమైంది.
యోగి ఆదిత్యానాథ్(Yogi Adityanath) రెండోసారి యూపీ సీఎంగా కొలువు తీరనున్నారు. మోదీ త్రయం ఈ ఎన్నికలను సెమీ ఫైనల్స్ గా భావించింది. విజయం సాధించిన అనంతరం యోగి మీడియాతో మాట్లాడారు.
రాష్ట్ర ప్రజలు తమపై నమ్మకం ఉంచి గెలుపు అందించారని కొనియాడారు. అందరి నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు. మోదీ నాయకత్వంలో బీజేపీ ఘన విజయం సాధించిందన్నారు.
అభివృద్దిని చూసే ప్రజలు రెండోసారి కట్టబెట్టారని చెప్పారు. యూపీలో తొలిసారి ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయని చెప్పారు. తమపై చేసిన ఆరోపణలను ప్రజలు తిప్పి కొట్టారని అన్నారు.
యూపీని దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా మారుస్తానని హామీ ఇచ్చారు యోగి ఆదిత్యానాథ్.
Also Read : గోవాలో బీజేపీదే అధికారం సావంత్ సీఎం