Rahul Gandhi Modi Mother : హీరా బెన్ త్వ‌ర‌గా కోలుకోవాలి

ట్విట్ట‌ర్ వేదిక‌గా రాహుల్ గాంధీ వెల్ల‌డి

Rahul Gandhi Modi Mother : కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు రాహుల్ గాంధీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ త‌ల్లి హీరా బెన్ అనారోగ్యం కార‌ణంగా బుధ‌వారం మ‌ధ్యాహ్నం అహ్మ‌దాబాద్ లోని ఆస్ప‌త్రిలో చేరారు. ప్ర‌స్తుతం ఆమె ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డగా ఉంద‌ని ఆస్ప‌త్రి వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

ఆస్ప‌త్రి చుట్టూ భారీ బందోస్తును ఏర్పాటు చేశారు. సీఎం భూపేంద్ర ప‌టేల్, మంత్రులు ద‌గ్గ‌రుండి ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా త‌న త‌ల్లితో త‌న‌కు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ. ఇటీవ‌ల గుజ‌రాత్ రాష్ట్రంలో జ‌రిగిన ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఆయ‌న త‌ల్లి హీరా బెన్ ను క‌లుసుకున్నారు. ఆశీర్వాదం అందుకున్నారు.

చివ‌రి ద‌శ పోలింగ్ సంద‌ర్భంగా హీరా బెన్ త‌న ఓటు హ‌క్కు కూడా వినియోగించుకున్నారు. ఆమె ఇటీవ‌లే 100 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఇదే విష‌యాన్ని పంచుకున్నారు న‌రేంద్ర మోదీ. ఈ సంద‌ర్భంగా హీరా బెన్ కు అస్వ‌స్థ‌త అని తెలుసుకున్న వెంట‌నే రాహుల్ గాంధీ స్పందించారు.

నా నుంచి ఏ మ‌ద్ద‌తు కావాల‌న్నా మీకు త‌ప్ప‌క ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. త‌ల్లీ కొడుకుల మ‌ధ్య ఉండే ప్రేమ శాశ్వ‌త‌మైన‌ద‌ని, వెల క‌ట్ట‌లేనిద‌ని పేర్కొన్నారు రాహుల్ గాంధీ. ఆమె త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కోరారు. ఈ సంద‌ర్భంగా మోదీ సంయ‌మ‌నం పాటించాల‌ని సూచించారు.

మోదీజీ ఈ క‌ష్ట స‌మ‌యంలో మీకు నా ప్రేమ , మ‌ద్ద‌తు ఎల్ల‌ప్పుడూ ఉంటుంద‌ని స్ప‌ష్టం చేస్తున్నాన‌ని తెలిపారు రాహుల్ గాంధీ(Rahul Gandhi Modi Mother). అమ్మ త్వ‌ర‌గా కోలుకుకుంటుంద‌ని ఆశిస్తున్నాన‌ని పేర్కొన్నారు.

Also Read : నిల‌క‌డ‌గా మోదీ త‌ల్లి హీరా బెన్ ఆరోగ్యం

Leave A Reply

Your Email Id will not be published!