Youth Congress Protest : యూత్ కాంగ్రెస్ ఆందోళన ఉద్రిక్తం
అసెంబ్లీని ముట్టడించేందుకు యత్నం
Youth Congress Protest : నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ యూత్ కాంగ్రెస్(Youth Congress) ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్ ఆందోళన చేపట్టారు. నిరుద్యోగులు పెద్ద ఎత్తున అసెంబ్లీని ముట్టడించేందుకు ప్రయత్నం చేశారు. వారిని లోపలకు వెళ్ల నీయకుండా పోలీసులు అడ్డుకున్నారు.
Youth Congress Protest Raising
బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ నిరుద్యోగుల జీవితాలతో ఆటాడుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో 2 లక్షల జాబ్స్ ఖాళీగా ఉన్నా ఇప్పటి వరకు ఒక్క పోస్టు కూడా భర్తీ చేసిన పాపాన పోలేదన్నారు. ప్రభుత్వం మాయమాటలు చెబుతూ మోసం చేస్తోందని ఆరోపించారు. పోస్టులను అమ్ముకున్న వారిపై ఇంత వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
గతంలో ఇంటికో ఉద్యోగం ఇస్తానని అన్న సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు 1,68, 896 రూపాయల నిరుద్యోగ భృతిని వెంటనే విడుదల చేయాలని కోరారు. తెలంగాణ ఉద్యమం పేరుతో మోసం చేసిన ఘనత కేసీఆర్ దేనని ఆరోపించారు. అన్ని వ్యవస్థలను నాశనం చేశాడని , కేవలం సంక్షేమ పథకాల పేరు చెప్పి సీఎం కుర్చీలో కూర్చున్న కేసీఆర్ తన ఇంట్లో వారికి పదవులు ఇచ్చాడని కానీ నిరుద్యోగులకు లేకుండా పోయిందన్నారు.
Also Read : Minister Mallareddy : మేడ్చల్ అభ్యర్థులను నేనే డిసైడ్ చేస్తా