KTR : దేశాభివృద్ధిలో యువత కీలకం – కేటీఆర్
యువతీ యువకులకు ఎనలేని అవకాశాలు
KTR : రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ యువతపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలన్నారు. హైదరాబాద్ లోని మహీంద్రా విశ్వ విద్యాలయం తొలి స్నాతకోత్సవం నిర్వహించింది.
ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. దేశ జనాభాలో అత్యధిక శాతం 27 ఏళ్ల లోపు ఉన్నారని తెలిపారు. ప్రధానంగా దేశంలో యువతకు కీలక ప్రాధాన్యత తాము ఇస్తున్నామని చెప్పారు.
ప్రస్తుతం యువత ఇన్నోవేషన్స్ లో కీలక పాత్ర పోషిస్తున్నట్లు చెప్పారు. నాయకులు రాజకీయాలకు పరిమితం కాకూడదని, దేశాన్ని ప్రభావితం చేసే ఆర్థిక అంశాలపై ఎక్కువగా దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు మంత్రి కేటీఆర్(KTR).
వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఇప్పుడు హైదరాబాద్ ను ఎంచుకుంటున్నారని తెలిపారు. ఇప్పుడు హైదరాబాద్ గ్లోబల్ సిటీగా పేరొందిందని చెప్పారు కేటీఆర్.
చాలా మంది మహీంద్రా యూనివర్శిటీలో చదువు కోవడం వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుందన్నారు. హైదరాబాద్, తెలంగాణలో ఉన్న ఉపాధి అవకాశాలను పరిశీలించాలని సూచించారు.
ఇన్నోవేషన్ , ఎంటర్ ప్రెన్యూర్ షిప్ ను ప్రమోట్ చేసేందుకు ఎక్కువ దృష్టి పెట్టామన్నారు. ఇతర రాష్ట్రాల కంటే భిన్నంగా ముందుకు వెళుతోందన్నారు.
ప్రస్తుతం ప్రపంచంలోని టాప్ కంపెనీలన్నీ హైదరాబాద్ వైపు చూస్తున్నాయని చెప్పారు మంత్రి కేటీఆర్(KTR). ఇతర రాష్ట్రాలలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు.
దేశానికే తెలంగాణ ఐటీలో ఆదర్శంగా నిలిచిందన్నారు. వీ హబ్ , టీ హబ్, అగ్రి హబ్ లు ఏర్పాటు చేశామన్నారు కేటీఆర్.
Also Read : అన్నీ ఉన్నా శాంతి లేదని ‘తలైవా’ ఆవేదన