YS Jagan : అమ్మ వారి అనుగ్ర‌హం జ‌గ‌న్ సంతోషం

శ్రీ శార‌దా పీఠం వార్షికోత్స‌వాల‌లో సీఎం

YS Jagan : ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విశాఖ శార‌దా పీఠంకు చేరుకున్నారు. శ్రీ శార‌దా పీఠం పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ స్వ‌రూపానందేంద్ర స‌ర‌స్వ‌తి ఆధ్వ‌ర్యంలో వార్షిక మ‌హోత్స‌వాలు జ‌రుగుతున్నాయి.

ఇవాళ మూడో రోజు. ప్ర‌త్యేకించి దేశ ర‌క్ష‌ణ కోసం అయిదు రోజుల పాటు రాజ శ్యామ‌ల యాగం నిర్వ‌హిస్తున్నారు. అమ్మ వారి యాగంలో పాల్గొనేందుకు ఇక్క‌డికి వ‌చ్చారు సీఎం జ‌గ‌న్ రెడ్డి(YS Jagan). ఆయ‌న‌కు అపూర్వ స్వాగ‌తం ల‌భించింది.

ఈ సంద‌ర్భంగా శ్రీ శార‌దా పీఠం అధిప‌తి సీఎంను ఆశీర్వ‌దించారు. ప్ర‌తి ఏటా మాఘ మాసం పంచ‌మి నుంచి ద‌శ‌మి దాకా శ్రీ శార‌దా పీఠం వార్షికోత్స‌వాలు కొన‌సాగుతాయి.

ఇందులో భాగంగా రాజ్య శ్యామ‌లాదేవి పూజ‌లో ఆసీనుల‌య్యారు జ‌గ‌న్ రెడ్డి. శార‌దా పీఠంలో భారీ ఎత్తున పండితులు పాల్గొన్నారు. వేద‌మంత్రోశ్చార‌ణ‌లు, భ‌క్తుల‌తో నిండిపోయింది శార‌దా పీఠం.

ఈ యాగం సంద‌ర్బంగా రుత్వికులు ల‌క్ష సార్లు అమ్మ వారికి సంబంధించిన నామార్చ‌న చేస్తుండ‌డం విశేషం. అంత‌కు ముందు వ‌న దేవ‌త‌, రాజ శ్యామ‌ల దేవి అమ్మ వార్ల‌కు పీఠాధిప‌తి స్వామి స్వ‌రూపానందేంద్ర స‌ర‌స్వ‌తి ప్ర‌త్యేక పూజ‌లు జ‌రిపించారు.

ఇక చ‌తుర్వేద పారాయ‌ణం మ‌ధ్య యాగం, హోమం కొన‌సాగుతోంది. వేద పాఠ‌శాల‌లో చ‌దువుకుంటున్న వారికి, ఉత్తీర్ణులైన విద్యార్థుల‌కు ప‌త్రాలు అంద‌జేశారు.

ఇదిలా ఉండ‌గా తాను అంద‌రి వాడిన‌ని నిరూపిస్తున్నారు జ‌గ‌న్ రెడ్డి. భారీ ఎత్తున నిర్మించిన స‌మ‌తామూర్తి విగ్ర‌హాన్ని ముచ్చింత‌ల్ లో ద‌ర్శించుకున్నారు.

ఆయ‌న‌కు శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయ‌ర్ స్వామి వారు ఆశీస్సులు అంద‌జేశారు.

Also Read : శ్రీ‌ శార‌దా పీఠం వార్షిక మ‌హోత్స‌వం

Leave A Reply

Your Email Id will not be published!