YS Jagan: వీర జవాన్‌ మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్

వీర జవాన్‌ మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్

YS Jagan : వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గోరంట్ల మండలం కల్లితండాలో పర్యటించారు. ‘ఆపరేషన్‌ సిందూర్‌’లో భాగంగా జమ్ముకశ్మీర్‌లో శత్రుమూకలను తుదముట్టిస్తూ వీరమరణం పొందిన జవాన్‌ ముడావత్‌ మురళీ నాయక్‌ కుటుంబ సభ్యులను వైఎస్‌ జగన్‌ పరామర్శించారు. ఉదయం బెంగళూరులోని నివాసం నుంచి బయలుదేరి రోడ్డు మార్గంలో చిక్కబళ్లాపురం, కొడికొండ చెక్‌పోస్టు, పాలసముద్రం, గుమ్మయ్యగారిపల్లి మీదుగా గంటలకు కల్లితండాకు చేరుకున్నారు. దేశ రక్షణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నివీర్‌ మురళీనాయక్‌ తల్లిదండ్రులు శ్రీరాంనాయక్, జ్యోతిబాయిని పరామర్శించిన వైఎస్‌ జగన్‌… అనంతరం తిరుగు పయనమయ్యారు.

YS Jagan Meet..

మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం వైఎస్‌ జగన్‌(YS Jagan) మీడియాతో మాట్లాడుతూ… దేశం కోసం పోరాడుతూ, మురళీనాయక్‌ వీరమరణం పొందారని… మురళీ చేసిన త్యాగానికి దేశం రుణపడి ఉందన్నారు. మురళీనాయక్‌ అందరికీ స్ఫూర్తిదాయకం. మురళీ త్యాగానికి మనమంతా రుణపడి ఉంటాం. మురళీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా. జవాను చనిపోతే రూ. 50 లక్షల రూపాయలు ఇచ్చే సంప్రదాయం తమ ప్రభుత్వం ప్రారంభించిందని… టీడీపీ కూటమి ప్రభుత్వం ఇదే విధానం కొనసాగిస్తోందన్నారు. మురళీనాయక్‌ కుటుంబానికి వైఎస్సార్‌సీపీ తరఫున రూ.25 లక్షలు సాయం అందిస్తాం. మురళీ చేసిన త్యాగానికి దేశం రుణపడి ఉందన్నారు. మురళీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా. మురళీ కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది’’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు.

Also Read : AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో గోవిందప్ప అరెస్ట్

Leave A Reply

Your Email Id will not be published!