EC Shock To YS Jagan : పార్టీ శాశ్వత చీఫ్ గా జగన్ ఎన్నిక చెల్లదు
బిగ్ షాక్ ఇచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం
EC Shock To YS Jagan : కేంద్ర ఎన్నికల సంఘం కోలుకోలేని షాక్ ఇచ్చింది. వైఎస్సార్ సీపీ శాశ్వత అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఏకగ్రీవంగా పార్టీ సభ్యులు ఎన్నుకున్నారు.
జగన్ రెడ్డి అధ్యక్షుడిగా ఎన్నిక చల్లదని ఎన్నికల సంఘం(EC Shock To YS Jagan) స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి వైసీపీ ప్రధాన కార్యదర్శికి పలు సార్లు లేఖలు కూడా రాశామని వెల్లడించింది ఈసీ.
ఇది ఎన్నికల సంఘం నియమ నిబంధనలకు విరుద్దమంటూ స్పష్టం చేసింది. నోటీసులు కూడా జారీ చేసినట్లు తెలిపింది. శాశ్వత అధ్యక్షుడిగా జగన్ మోహన్ రెడ్డి ఎన్నిక ఎట్టి పరిస్థితుల్లో చెల్లుబాటు కాదని పేర్కొంది ఈసీ.
ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయ సాయి రెడ్డికి లేఖ కూడా రాసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది.
ఇటీవల వైసీపీ ప్లీనరీలో ఎప్పటికీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తమ అధ్యక్షుడంటూ ఆయనకు వ్యతిరేకంగా ఏ ఒక్కరూ బరిలో ఉండరంటూ తీర్మానం ప్రవేశ పెట్టింది.
ఇందుకు సంబంధించి పార్టీ పరంగా ఎవరూ పోటీ చేసేందుకు ముందుకు రాలేదు. సభ్యులంతా మూకుమ్మడిగా తమ పార్టీకి జగన్ రెడ్డినే చీఫ్ అంటూ పెద్ద ఎత్తున తీర్మానాలు కూడా ప్రవేశ పెట్టారు.
ఇదిలా ఉండగా విజయ సాయి రెడ్డికి ఎన్నిసార్లు లేఖలు రాసినా ఇప్పటి వరకు సమాధానం ఇవ్వలేదంటూ ఈసీ పేర్కొనడం చర్చకు దారితీసింది. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ అయినా తరచూ ఎన్నికలు జరపాల్సిందేనంటూ స్పష్టం చేసింది ఎన్నికల సంఘం.
Also Read : ఎన్ఐఏ సోదాలు 100 మంది అరెస్ట్