YS Jagan : రైత‌న్న‌ల‌కు ఏపీ స‌ర్కార్ ఖుష్ క‌బ‌ర్

50 శాతం స‌బ్సిడీపై ప‌నిముట్లు

YS Jagan : సందంటి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సార‌థ్యంలోని ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటోంది. రాష్ట్రాన్ని అభివృద్ధి ప‌థంలో న‌డిపించేందుకు కృషి చేస్తోంది.

గ‌త ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల‌న్నింటినీ నెర‌వేర్చేందుకు శ‌త‌విధాలుగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు సీఎం. ఇందుకు సంబంధించి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తూ వ‌స్తున్నారు.

అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను ఆదుకునేందుకు కీల‌క‌మైన కార్య‌క్ర‌మాల‌కు శ్రీ‌కారం చుట్టారు. ప్ర‌ధానంగా పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి, బ‌ల‌హీన, మైనార్టీ, క్రిస్టియ‌న్ వ‌ర్గాల‌కు మేలు చేకూర్చే సంక్షేమ ప‌థ‌కాల‌కు ప్ర‌యారిటీ ఇస్తున్నారు.

ప్ర‌ధానంగా విద్య‌, వైద్యం, ఉపాధి, ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటు, టెక్నాల‌జీ, వ్య‌వ‌సాయ రంగానికి అధిక ప్రాధాన్య‌త ఇస్తూ నిధులు కేటాయిస్తున్నారు.

దేశంలో ఎక్క‌డా లేని రీతిలో ఆర్బీకే సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేసింది ఏపీ ప్ర‌భుత్వం. తాజాగా రైతుల‌ను ఆదుకునేందుకు వ‌డ్డీ లేని రుణాలు అంద‌జేస్తున్నారు.

అంతే కాకుండా వ్య‌వ‌సాయ సాగులో నిత్యం ఉప‌యోగించే ప‌నిముట్ల‌ను 50 శాతం స‌బ్సిడీతో అంద‌జేయాల‌ని నిర్ణ‌యించారు. ఇందుకు గాను రూ.403 కోట్ల విలువైన ప‌రిక‌రాలు పంపిణీ చేసింది ప్ర‌భుత్వం(YS Jagan).

2.68 ల‌క్ష‌ల మందికి రూ. 15 వేల విలువైన ప‌రిక‌రాలు అంద‌జేశారు. 80,600 మందికి రూ. 50 వేల విలువైన ప‌రిక‌రాలు పంపిణీ చేశారు.

స్థానికంగా రైతులు కోరుకున్న ప‌రిక‌రాల పంపిణీకి చ‌ర్య‌లు తీసుకున్నారు. రైతుల‌కు ఏమేం కావాలో వ్య‌వ‌సాయ శాఖ ద్వారా స‌ర్వే చేయించారు.

రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున స‌ర్వే చేప‌ట్టారు. ల‌క్షా 80 వేల మంది రైతుల‌ను ఈ సంద‌ర్భంగా వివ‌రాలు సేక‌రించారు. వారి అభిప్రాయ‌లు, సూచ‌న‌ల మేర‌కు యంత్రాల‌ను అంద‌జేశారు.

Also Read : భ‌ద్ర‌త స‌రే సౌక‌ర్యాల మాటేంటి..?

Leave A Reply

Your Email Id will not be published!