YS Jagan : ఏపీ ప్రభుత్వం పంతుళ్లకు ఖుష్ ఖబర్ చెప్పారు. రాష్ట్రంలో పని చేస్తున్న 30 వేల మంది పంతుళ్లకు త్వరలోనే పదోన్నతి కల్పిస్తామని స్పష్టం చేశారు. ఆయన సీఎం క్యాంపు కార్యాలయంలో విద్యా శాఖపై సమీక్షించారు.
ఎస్జీటీలను స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్స్ ఇస్తున్నట్లు ప్రకటించారు. నూతన విద్యా విధానంలో ఏర్పాటు అయ్యే పాఠశాలలో పని చేసే అవకాశం కలుగుతుందన్నారు.
అయితే విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్లను నియమిస్తామన్నారు సీఎం(YS Jagan). సబ్జెక్టుల వారీగా అందుబాటులోకి టీచర్లు ఉండేలా చూడాలని ఆదేశించారు.
వచ్చే జూన్ నెల నాటికి ప్రమోషన్స్ , ట్రాన్స్ ఫర్ల ప్రక్రియ పూర్తి చేయాలని అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని మండలాలో ఉన్న రెండు పాఠశాలలను ఓ కాలేజీగా మారుస్తామన్నారు.
ఇందులో ఒక దానిని కో ఎడ్యూకేషన్ గా మరో దానిని పూర్తిగా బాలికల కోసమే ఏర్పాటు చేయాలన్నారు. ఆయా పాఠశాలల్లో పని చేస్తున్న టీచర్లకు బోధనేతర పనులు అప్పగించవద్దని ఆదేశించారు.
ఏ మాత్రం ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సీఎం జగన్ రెడ్డి(YS Jagan). జాతీయ విద్యా విధానం ప్రకారం ఇప్పటి వరకు 19 వేల స్కూళ్ల మ్యాపింగ్ పూర్తయ్యిందన్నారు.
17 వేల పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్ల నియామకం, రేషనలైజేషన్ ద్వారా మరో 8 వేల మందికి ప్రమోషన్స్ లభిస్తాయన్నారు.
పనిలో పనిగా విద్యార్థులకు బోధించే టీచర్లు మరింత నైపుణ్యాలను పెంపొందించు కోవాలని సూచించారు జగన్ రెడ్డి. ఇదే సమయంలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎంఈఓ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సీఎం.
Also Read : మహిళా వర్శిటీగా కోఠీ ఉమెన్స్ కాలేజ్