YS Jagan Amit Shah : అమిత్ షాతో ముగిసిన సీఎం జగన్ భేటీ
ప్రధానితో పాటు పలువురు మంత్రులతో సమావేశం
YS Jagan Amit Shah : ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ ముగిసింది. ఆయన రెండు రోజుల పాటు పర్యటించారు. ఈ సందర్భంగా మొదట జగన్ రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీని కలిశారు.
45 నిమిషాల పాటు ఇద్దరి మధ్య సమావేశం జరిగింది. సీఎం వెంట వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు , ఎంపీ విజయ సాయి రెడ్డి కూడా ఉన్నారు. ఏపీ రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలను ప్రధాన మంత్రితో ప్రస్తావించారు సీఎం.
పేరుకు పోయిన సమస్యలను పరిష్కరించాలని, రాష్ట్రానికి రావాల్సిన నిధులను మంజూరు చేయాలని కోరారు. ఈ మేరకు పీఎం మోదీ సానుకూలంగా స్పందించారు.
గురువారం మధ్యాహ్నం కలిసిన జగన్ రెడ్డి(YS Jagan Amit Shah) సాయంత్రం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిశారు. శుక్రవారం ఉదయం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాతో భేటీ అయ్యారు.
సమావేశం ముగిసిన అనంతరం జగన్ రెడ్డి తిరుగు ప్రయాణం అయ్యేందుకు ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. రాష్ట్ర అభివృద్ది ఎజెండాగా కొనసాగింది సీఎం ఢిల్లీ టూర్.
ఈ కీలక పర్యటనలో ఏపీ సీఎం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ చంద్ర షా(YS Jagan Amit Shah), నిర్మలా సీతారామన్ , గజేంద్ర షింగ్ షెకావత్ తో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.
ఈ కీలక చర్చల్లో పోలవరం ప్రాజెక్టు ప్రధానంగా ప్రస్తావనకు వచ్చిందని సమాచారం. రెవెన్యూ లోటు భర్తీ, తదితర కీలక అంశాల గురించి కూడా చర్చించారు.
జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్దిదారుల ఎంపిక, మెడికల్ కాలేజీల మంజూరు, తదితర అంశాలు కూడా చర్చకు వచ్చాయి.
Also Read : ఏపీ రైతులకు భారీ ఎత్తున రుణాలు – సీఎం